chandrababu is the only leader who competes with modi మోదీని ఎదుర్కోనే సమర్థుడైన నేత చంద్రబాబే..!

Chandrababu is the only leader who competes with modi

Chandrababu, TDP, YSRCP, no confidence motion, Narendra Modi, PM Modi, BJP, lok sabha, rajya sabha, janasena, congress, ysrcp, cpi, cpm, Andhra pradesh special status, congress, andhra pradesh, politics

Telugu Desam Party National President and Andhra Pradesh chief minister Chandrababu naidu is the only leader in National politics who can compete with Prime Minister Narendra Modi in the present political scenario.

మోదీని ఎదుర్కోనే సమర్థుడైన నేత చంద్రబాబే..!

Posted: 04/23/2018 01:01 PM IST
Chandrababu is the only leader who competes with modi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలనపగ్గాలను చేపట్టిన, సుదర్ఘ రాజకీయ అనుభవం వున్న రాజకీయ ధురంధరుడు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేవలం రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి సుపరిచితడైన నాయకుడు. చాణక్య రాజనీతిని అవపోసన పట్టిన నేతగా ఆయన జాతీయ రాజకీయాలలో చక్కని పేరుంది. అలాంటి నేత గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి మంచి చేకూర్చాలని కేంద్రంలోని బీజేపితో సక్యతగా మెలిగారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో మిత్రపక్షంగా వుంటూవచ్చారు. అయినా రాష్ట్రానికి కేంద్రం ఒనగూర్చిన లాభం మాత్రం అంతంతమాత్రమే.

ఇదిగో ఇస్తాం. అదిగో ఇస్తాం అని కేంద్రం ప్రత్యేక హోదాపై తాత్సరం చేసి.. చివరకు పక్కనబెట్టనా.. దానికి నీతి అయోగ్ సిఫార్పులను కారణంగా చూపినా.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పినా.. అందుకు కూడా సరేనన్న నేత చంద్రబాబు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు.. పట్టిసీమ ప్రాజెక్టు ఇత్యాదులను నిర్మించి ముందుగా రాష్ట్ర రైతాంగానికి మేలు చేస్తే మంచిదని భావించి.. కేంద్రం ఏం చెప్పినా.. ఎలాగోలా కేంద్రాన్ని ఒప్పించి తాను రాష్ట్రాభివృద్ది బాటలు వేయవచ్చని భావిస్తూ వచ్చారు.

జాతీయ రాజకీయాల జోలికి వెళ్లకుండా.. ఈ నాలుగేళ్లుగా కేవలం తన వరకు రాష్ట్రాభివృద్దే ప్రధానాంశంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి. గతంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పేరు మార్మోగిన విషయం అందరికీ తెలిసిందే. వామపక్షాలతో కలసి ధర్డ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు కానీ, లేక ఎన్డీయే హయంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ.. చంద్రబాబు జాతీయ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. మరోలా చెప్పాలంటే అంధ్రప్రదేశ్ నుంచి తెలుగోడి సత్తాను జాతీయంగా చాటిన నేత చంద్రబాబు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. బాలయోగిని పార్లమెంటు స్పీకర్ పదవిలో కొనసాగేలా చేసి.. తెలుగువాడికి ప్రాముఖ్యతను, ప్రాథాన్యతను ప్రపంచానికి చాటిన నేత చంద్రబాబు. అమెరికా అధ్యక్షుడు నేరుగా హైదరాబాద్ పర్యటనకు వచ్చేలా చేసిన ఘనత కూడా తెలుగుదేశం (పార్టీ) ప్రభుత్వానిదే.

అలా జాతీయ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులలో నవ్యాంద్ర ప్రదేశ్ రాజధాని కూడా లేని రాష్ట్రంగా విడిపోయిన పక్షంలో రాష్ట్రమే ముఖ్యమని జాతీయ రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. అయితే చంద్రబాబు చాణక్యనీతి తెలిసిన కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆయనకు రాష్ట్రాభివృద్ది విషయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. మోడీ సర్కార్ తన పార్టీని అంధ్రప్రదేశ్ లో విస్తరింపజేయాలని అన్నింటినీ రాజకీయ కోణంలోనే అలోచించింది. ఈ క్రమంలో చంద్రబాబుకు అడిగినన్ని నిధులిచ్చినా.. లేక అ దిశగా తాము ఏ నిర్ణయం తీసుకున్న ఏపీలో తమ పార్టీ బలపడదని భావించిందో ఏమో  కానీ చంద్రబాబుతో కాసింత దూరం జరుగుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తుది బడ్డెట్ లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేయడంతో ఇక కేంద్రంతో అమీతూమి తేల్చుకునేందుకు కూడా చంద్రబాబు సిద్దమయ్యారు. బడ్జెట్ మలివిడత సమావేశాలలో తమ ఎంపీలతో నిరసనలు చేయాలని అదేశించారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు దేశ చరిత్రలో దాదాపుగా 2001 తరువాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కూడా చంద్రబాబు అదేశాల మేరకు టీడీపీ ఎంపీలు కొనసాగించిన నిరసనలే కారణం. ఈ క్రమంలో చంద్రబాబు పేరు మరోమారు జాతీయ రాజకీయాలలో ప్రతిధ్వనించింది. ఆయన పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న విధానం కూడా చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం ఎలా కుట్రలు పన్నుతుందో కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ముందుగానే చెబుతూ వచ్చారు. తనపై మోడీ ప్రభుత్వం సీబిఐ దాడులు కూడా చేయిస్తుందని.. రాష్ట్రానికి నిధులు ఇవ్వలేని ప్రభుత్వం.. ప్రభుత్వాలపైనే తమ చెక్కుచేతల్లో వుంచుకున్న సంస్థలతో దాడులు చేయించి తనపై కేసులు పెట్టేందుకు కూడా కుట్రలు పన్నుతుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు తమకు అనుకూలంగా రాష్ట్రంలోని విపక్షాన్ని కూడా కేంద్రం చేరదీసిందని ఆయన అరోపించారు. ఈ క్రమంల ఆయన హస్తినకు కూడా వెళ్లి అటు ఎన్డీఏలోని మిత్రపక్ష పార్టీలతో పాటు ఇటు పార్లమెంటులోని విపక్ష నేతలను కూడా కలిసారు.

దీంతో అసక్తికరమైన అంశాన్ని ఓ జాతీయ మీడియా తెరపైకి తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్రమోడీని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కోనగలిగే నాయకుడు ఎవరన్న అంశాన్ని లేవనెత్తింది. కాంగ్రెస్ మినహా మరో నేత ఎవరు..? ఎవరి నేతృత్వంలో దేశంలోని విపక్షాలన్నీ కలసి సంఘటితంగా ఏర్పేడే అవకాశం వుంది.? దేశంలోని విపక్షాలను ఏకం చేయగలియే నేత ఎవరు..? అంటూ ప్రశ్నలను సర్వేలో పాల్గోన్న ప్రజలముందు పెట్టింది. అయితే అసక్తికరంగా ఇందులో చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపించిడం ఆయనకు జాతీయ రాజకీయాలలో వున్న గుర్తింపును మరోమారు ప్రస్పుటించేలా చేసింది.

ఔనా..? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారా.? నిజమండీ. యావత్ దేశంలో కాంగ్రెస్ మినహా దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. ప్రధాని నరేంద్రమోడీని ధీటుగా ఎదుర్కోవడం కేవలం చంద్రబాబు వల్లే అవుతుందని దేశప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ జాబితాలో ఆ తరువాతి స్థానంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లు వినిపించాయి. అయితే అధికంగా ఏకంగా 49 శాతం మంది ప్రజలు మాత్రం ఇది కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమని స్ఫష్టంగా చెప్పారు. అయితే ఈ సర్వే వివరాలు వెల్లడైన నేపథ్యంలో మరీ బీజేపి ఏం నిర్ణయం తీసుకుంటుందో..? రాజకీయ ధురంధరుడి ఇలాకాలో అడుగుపెట్టి అక్రమించేందుకు ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే అపరచాణక్యుడితో కయ్యం కన్నా కలసివెళ్లడమే నయం అని భావిస్తుందో..? అన్నది కూడా వేచి చూడాల్సిందే.

 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  TDP  YSRCP  no confidence motion  Narendra Modi  PM Modi  National Politics  

Other Articles

Today on Telugu Wishesh