public abuse and private apology doen't work: Pawan Kalyan నడిబజారులో తిట్టించి.. నాలుగుగొడల మధ్య క్షమాపణలా: పవన్

Public abuse and private apology doen t work pawan kalyan

Jana sena, Pawan Kalyan, twitter, andhra jyothy, radha krishna, Prime Minister, Unparliamentary language, transperancy politics, TDP, ap special status, TDP MPs, TDP yellow media, Andhra pradesh, special status, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan questionaire to andhrajyothy radha krishna, and says public abuse and private apology doen't work with him.

నడిబజారులో తిట్టించి.. నాలుగుగొడల మధ్య క్షమాపణలా: పవన్

Posted: 04/23/2018 09:57 AM IST
Public abuse and private apology doen t work pawan kalyan

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలోకి ఏ సంబంధం లేని తనను లాగి.. తన తల్లిని తిట్టించి.. అదే బూతు పదాన్ని పదే పదే టీవీల్లో చూపించిన మీడియా.. ఈ వ్యవహారం వెనకనున్న టీడీపీ పార్టీని టార్గెట్ చేసిన పవన్ కల్యాన్ వారిపై మరోమారు తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. పబ్లిక్ గా ఆరు నెలల పాటు తనను, తన అభిమానులను, తన కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులను తిట్టించి.. అదే అంశానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి.. దానిలోకి తనను లాగి. తన తల్లిని కూడా తి్ట్టించి.. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా క్షమాఫనలు కోరుతారా..? అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

తన అభిమానులతో పాటు తనపై ఆరు నెలలుగా అత్యాచారం చేసి.. ఇప్పుడు చాటుగా మన్నించమని ఫీలర్స్ ను పంపుతారా..? అంటూ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నడిబజారులో తిట్టించి.. నాలుగు గోడల మధ్య క్షమించాలని కోరుతారా.? దీంతో మీ నీచపు బుద్ది బయటపడిందని విమర్శించిన ఆయన.. ఇలాంటివి తన వద్ద చెల్లవని చెప్పారు. అమెరికా దేశపు రాజ్యాంగపు ప్రియాంబుల్ దేవుడి యందు నమ్మకం కాగా, టీడీపీ ప్రియాంబుల్ మాత్రం బూతు యందు నమ్మకమని విమర్శించారు. అక్కడ దేవుడైతే ఇక్కడ బూతు తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అని ఆయన వ్యంగొక్తులను విసిరారు.

ఇక అంతకుముందు పచ్చమీడియాను టార్గెట్ చేసిన పవన్ అంధ్రజ్యోతి రాధాకృష్ణను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ‘ఏబీఎన్’ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో పవన్ అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘ఆర్కే, మీ దూషణలను మేము భరిస్తాం. వాటు టూ డూ? మేము సాత్వికం.. పైగా పవర్ లెస్. మేము బాధపడతాం’ అని ఓ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో..‘టీడీపీ జ్యోతి రత్న, ఆర్కే.. టీడీపీ సంస్కృతి ఏంటి.. పీఎం నుంచి సాధారణ వ్యక్తి వరకూ ప్రతిఒక్కరిని దూషించడమా.. గుడ్ ట్రైనింగ్, కీపిటప్..’ అని విమర్శించారు. ఇంకో ట్వీట్ లో..‘’ప్రత్యేక హోదా’ సాధించేందుకు టీడీపీ నేతలకు గొప్ప వ్యూహం ఉంది, అత్యంత అసభ్యకరమైన పదజాలంతో ప్రధానమంత్రిని తిట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు? కచ్చితంగా, ఆ సలహా ఇచ్చింది ఆర్కే నే’ అని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles