Minaret At Taj Mahal Complex Collapses తాజ్ మహల్ ముఖద్వారం పిల్లర్ విరిగిపడింది..

Pillar of taj mahal entry gate collapses due to heavy rain in agra

taj mahal, taj mahal minaret collapses, taj mahal minaret, taj mahal minaret crashes, taj mahal minaret collpase, taj mahal collapse, taj mahal minaret rain, taj mahal minaret damaged, taj mahal minaret heavy rains, taj mahal minaret high winds, taj mahal minaret thunder storm, taj mahal minaret Darwaza-e-Rauza, Darwaza-e-Rauza, india news

A 12-feet minaret at the entry gate of Taj Mahal collapsed due to heavy rain and high winds. The metal pillar which was referred to as Darwaza-e-Rauza was situated at the entry gate and reportedly crashed as wind speed crossed 100 km per hour during the thunderstorm.

తాజ్ మహల్ ముఖద్వారం పిల్లర్ విరిగిపడింది..

Posted: 04/12/2018 12:19 PM IST
Pillar of taj mahal entry gate collapses due to heavy rain in agra

ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌ కూడా ప్రకృతి ప్రకోపాన్ని చవిచూసింది. ప్రపంచ ఏడో వింతగా అభివర్ణించబడే ఈ కట్టడాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వున్న పురావస్తు శాఖ అధికారులపై వుండగా, నిన్న రాత్రి అగ్రా సమీప ప్రాంతాల్లో పెద్ద పెట్టున ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం ధాటికి తాజ్ మహాల్ లోని ప్రవేశ ద్వారంలోని పన్నెండు మీటర్ల పొడుగున్న పిల్లర్‌ ధ్వంసమైంది. క్రితం రోజు రాత్రి సుమారు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు తోడు కుండపోత వర్షాలు కురవడంతో.. తాజ్ మహల్ కట్టడానికి దక్షిణ దిశగా ఉన్న ప్రవేశద్వారం పిల్లర్‌ కూలిందని తెలిపారు.

దర్వాజా-ఎ-రౌజా గా పిలవబడే ద్వారం వద్ద నున్న పిల్లర్, సహా డోంబ్ కూడా కుప్పకూలిపోయాయి. పెనుగాలులకు కిందపడి అవి ముక్కలుముక్కలయ్యాయి. అయితే పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్ లో ఈ ఘటన చోటుచేసుకున్నా ఏలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదని అధికారులు తెలిపారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్‌ మహల్ లోకి వీక్షకులను రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taj mahal  minaret  Darwaza-e-Rauza  collapse  high winds  thunder storm  agra  uttar pradesh  

Other Articles

Today on Telugu Wishesh