murder attempt on ycp leader ramesh reddy house వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం..

Gun shot create tension in tadipatri ycp leader ramesh reddy house

YCP leader Ramesh Reddy, Gun shots in tadipatri, Gun shot at ananthapur, Gun shot in andhra pradesh, Gun shot at YCP leader Ramesh Reddy, andhra pradesh, crime

Faction politics backroped Ananthapur had witness one such incident at Tadipatri today when an armed person had today targeted YSRCP leader Ramesh Reddy attempted for murder in his house.

తాడిపత్రిలో కాల్పుల కలకలం.. వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం..

Posted: 04/12/2018 01:16 PM IST
Gun shot create tension in tadipatri ycp leader ramesh reddy house

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మరోమారు తుపాకి కాల్పుల కలకలం రేగింది. ఇటీవలే తన తండ్రిపై తనయుడు జరిపిన కాల్పులు ఘటన వెలుగుచూసిన క్రమంలో ఉలిక్కిపడ్డ రాష్ట్రం.. ఇవాళ మరోమారు అదే తరహాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాల్పులు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. పట్టణంలోని వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. బాలచందర్ అనే వ్యక్తి రమేష్ ఇంట్లోకి చొరబడి ఆయనపై హత్యాయత్నం చేయగా, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తో రమేష్ రెడ్డి బాలచందర్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాలచందర్ కాలికి గాయమైంది. తరువాత అతన్ని బంధించిన రమేష్ రెడ్డి, పోలీసులకు సమాచారాన్ని అందించగా, వారు వచ్చి నిందితుడ్ని అస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగింది.? ఎప్పడు జరిగింది..? నిందితులు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు..? అన్న ప్రశ్నలపై పోలీసులు రమేష్ రెడ్డిని విచారిస్తున్నారు. తమ నేతపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున రమేష్ రెడ్డి ఇంటి వద్దకు చేరారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఫాక్షన్ రాజకీయాలు మరోమారు పడగవిప్పాయా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YCP leader  Ramesh Reddy  Gun shots  tadipatri  ananthapur  andhra pradesh  crime  

Other Articles