ISRO launches IRNSS-1I navigation satellite నిర్దేశిత కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం..

Isro successfully launches inrss 1i navigation satellite

isro, isro irnss-1i launch, isro satellite launch, pslv, navic launch, sriharikota, sriharikota, isro news

In yet another success for ISRO, navigation satellite IRNSS-1I put into orbit. PTI|. Updated: Apr 12 ... ISRO Chairman K Sivan described the mission as a success and congratulated the scientists behind it.

పీఎస్‌ఎల్‌వీ-సి41 విజయవంతం.. కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం..

Posted: 04/12/2018 11:34 AM IST
Isro successfully launches inrss 1i navigation satellite

ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరో మైలు రాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ (డొమెస్టిక్ కంపాస్ సిస్టమ్) కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్వీ-సి41 నిప్పులు చిమ్ముతూ నింగికెగసి.. నిర్ధేశిత కక్షలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. నేటి తెల్లవారు జామున 4:04 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ.. కేవలం 19.19 నిమిషాల వ్యవధిలోలక్ష్యాన్ని చేరుకుంది. 32 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

నాలుగు దశల తరువాత రాకెట్ నుంచి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం విడిపోయి, శాస్త్రవేత్తలు నిర్ణయించిన సమయానికి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం బరువు 1425 కేజీలు. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో అది విఫలమైనట్టుగా ప్రకటించిన ఇస్రో.. దాని స్థానంలో ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఇస్రో ఇప్పటి వరకు 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపినట్టయింది.
 
జీపీఎస్ తరహా దేశీయ ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ ఇక త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రధానంగా రెండు రకాల సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఒకటి.. ‘ప్రామాణిక స్థితి సేవ’. దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు. ఇక రెండోది.. ‘నియంత్రిత సేవ’. ఇది అథీకృత వినియోగదారులకు మాత్రమే అందుతుంది. సాధారణ సేవల కచ్చితత్వం 20 మీటర్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. అంటే తేడాలు 20 మీటర్లలోపు ఉంటాయన్నమాట. సైనిక అవసరాలకు అందే ఎన్ క్రిప్టెడ్ సేవలు 0.1 మీటరు కన్నా మెరుగ్గా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isro  isro irnss-1i launch  isro satellite launch  pslv  navic launch  sriharikota  sriharikota  isro news  

Other Articles