Siddaramaiah scores 7 out of 10 in pre-poll survey పదింట ఏడుగురి ఓటు సిదరామయ్యకే.. బీజేపి అశలు అవిరే..!

Siddaramaiah government scores 7 out of 10 in pre poll survey

Karnataka elections, Karnataka Voter Survey 2018, Karnataka Assembly elections, Association for Democratic Reforms,DAKSH, Karnataka Assembly elections, siddaramaiah government, state government, National news, Karnataka news, SIddaramaiah, Politics news, latest news,Karnataka Assembly Election, Karnataka assembly election 2018, Karanataka, Karnataka polls, Karnataka poll dates, Election Comission, EC, Karnataka election date, Karnataka elections, Karnataka elections 2018, BJP Karnataka, Congress Karnataka, Election results, Karnataka date, siddaramaiah

The Association for Democratic Reforms (ADR) and DAKSH, a civil society organization, conducted a survey with 13,244 interviewees across 225 Assembly constituencies in Karnataka.

పదింట ఏడుగురి ఓటు సిదరామయ్యకే.. బీజేపి అశలు అవిరే..!

Posted: 04/04/2018 10:19 AM IST
Siddaramaiah government scores 7 out of 10 in pre poll survey

ఇప్పటికే కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఉత్తరాదిపై వరాల జల్లు కురిపిస్తుంటే.. ఇటు దక్షిణాది రాష్ట్రాలపై మాత్రం వివక్ష చూపుతుందని అరోపిస్తూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో కలసి పోరాటానికి కూడా వేదికను సిద్దం చేసేందుకు యత్నించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఆ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో వున్న యడ్యూరప్ప ప్రభుత్వంతో పొల్చితే సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు చాలా తక్కువని కర్ణాటకా ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కర్ణాటకలో మరోమారు అధికారాన్ని చేపట్టి తమ సత్తా చాటుకోవాలని యత్నిస్తున్న బీజేపి ఆశలు అవిరవుతున్నాయి.

కేంద్రంలోని మోడీ సర్కర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు.. బీజేపి నేతలు ఎప్పటికప్పుడు చేసే విమర్శలను కూడా తిప్పికొడుతూ కర్ణాటక రాజకీయాలలో తనదైన ముద్రవేసుకున్న సిద్దరామయ్యా.. మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని ఓటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు ఆయనకే జై కోడుతున్నారు. ఆయన పాలనను భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. పాలన తీరు, అమలు చేస్తున్న పథకాలకు ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పదిమందిలో ఏడుమంది ఆయన పాలన భేష్ అంటున్నారు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష్ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలో  ఈ విషయాలు వెలుగు చూశాయి. డిసెంబరు 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లో  13,244 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి పదిమంది ఓటర్లలో ఏడుగురు సిద్ధరామయ్య ప్రభుత్వానికి జై కొట్టారు. రాష్ట్రంలో కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు ఎక్కడా జరగలేదని, సిద్ధరామయ్య బాగా పనిచేస్తున్నారని అత్యధికులు కితాబిచ్చారు. కాగా, కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపి ఈ దఫా కూడా అధికారం అందని ద్రాక్షాగానే మిగులుతుందా.? వేచి చూడాల్సిందే మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  Survey  ADR  DAKSH  voters  SIddaramaiah  BJP  Congress  yeddurappa  Politics  latest news  Karnataka  

Other Articles