Woman shoots and wounds 4 at YouTube before killing herself యూట్యూబ్ కార్యాలయంలో కాల్పుల కలకలం..

Three people shot at youtube headquarters female suspect is dead

YouTube Shooting, YouTube, San Francisco, California, YouTube California office, San Bruno California, Google, police, shooter, YouTube, YouTube shooter, Female Suspect, sunder pichai, donald trump, crime

A woman opened fire at YouTube headquarters, setting off a panic among employees and wounding at least four people before fatally shooting herself, police and witnesses said.

ITEMVIDEOS: యూట్యూబ్ కార్యాలయంలో కాల్పుల కలకలం.. ముగ్గురికి తీవ్రగాయాలు..

Posted: 04/04/2018 11:06 AM IST
Three people shot at youtube headquarters female suspect is dead

అగ్రరాజ్యంలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పుల కలకలం రేగింది. ఓ మహిళ అనూహ్యంగా కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సరిక్షిత ప్రాంతాల్లోకి దాక్కున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో సరిగ్గా బోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 27 ఏళ్ల మహిళ పరిస్థితి బాగానే వున్నా మరో ఇద్దరు మాత్రం మృత్యువుతో పోరాడుతున్నారని వైద్య సిబ్బంది తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మొత్తం 1100 మందిని పోలీసులు హుటాహుటిన బయటికి తరలించారు. సరిగ్గా భోజనం విరామ సమయంలో ఉద్యోగులందరూ లంచ్ చేస్తుండగా ఓ మహిళ కార్యాలయంలోకి వచ్చి నేరుగా డైనింగ్ కోర్టుయార్డు వైపు దూసుకొచ్చింది. కార్యాలయం లోపలికి వెళ్తూ వెళ్తూనే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టింది. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయింది. అయితే కాల్పులకు తెగబడిన మహిళ ఎవరు..? అన్నది గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇంట్లో గొడవల కారణంగానే అమె  ఈ ధారుణానికి ఒడిగట్టిందని తెలుస్తుంది. తన ప్రియుడ్ని టార్గెట్ చేసి కాల్పులకు తెగబడటంతో ఈ దారుణ ఘటన సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు.  

ఈ ఘటనపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ... ‘‘ఇది భయంకరమైన హింసాత్మక చర్య...  ఊహించని ఈ విషాదం కారణంగా అందరూ షాక్ ఉన్నారని నాకు తెలుసు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం నలుగురికి గాయపడ్డారు. బాధితులకు మద్దతుగా కంపెనీ తరపున సహాయ చర్యలు చేపట్టాం..’’ అని వెల్లడించారు. మరోవైపు యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పుల సంగతి తెలియగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. ‘‘బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం. సమయానికి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన విచారణాధికారులకు, ఫస్ట్ రెస్పాండర్స్‌కి మా కృతజ్ఞతలు..’’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  police  shooter  YouTube  YouTube shooter  Female Suspect  sunder pichai  donald trump  crime  

Other Articles