Sex without wife's consent not rape: Gujarat HC భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు: గుజరాత్ హైకోర్టు

Non consensual sex with wife not a rape gujarat high court

gujarat high court, marital rape, marital rape cases, india rape law, marital rape criminalistaion, criminalise marital rape, Marital rape an injustice, marital rape, Rape, gandhinagar, CBI, CID, Gujarat High Court

The Gujarat High Court observed that non-consensual intercourse by a husband cannot be dubbed as rape. However, it also stated that subjecting his married partner to have oral or unnatural sex was akin to cruelty.

భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు: గుజరాత్ హైకోర్టు

Posted: 04/03/2018 03:44 PM IST
Non consensual sex with wife not a rape gujarat high court

మారిటల్ రేప్.. భార్యలైయినా సరే వారి అనుమతి, సమ్మతి లేకుండా బలవంతంగా శృంగారం నెరిపడం కూడా అత్యాచారమేనంటూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పునిచ్చి.. అయితే ఇందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా గుజరాత్ హైకోర్టు తీర్పును వెలువరించింది. భార్యలతో బలవంతపు శృంగారం తప్పేమీ కాదని తీర్పును వెలువరించింది. అసలు మారిటల్ రేప్ అన్నదే అన్యాయమని.. ఇలాంటి అక్షేపణలను పేర్కొంటు న్యాయస్థానాలకు వచ్చే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని మండిపడుతూ.. తీర్పును వెలువరించింది.

భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని స్పష్టం చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే, ఓరల్ సెక్స్ (నోటి ద్వారా), అసహజ మార్గాల్లో జీవిత భాగస్వామితో శృంగారం కోరుకుంటే అది క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు తన భర్త తనపై అత్యాచారం చేశాడని, హింసించాడని పేర్కోంటూ న్యాయస్థానాన్ని అశ్రయించిన ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఓ వ్యక్తి, జంతువు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే, అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యల వంటి విపరీత ప్రవర్తనలని పేర్కోంది.

అలాంటివి మినహాయిస్తే మిగిలినవేవి ఐపీసీలోని సెక్షన్ 377 కిందకు రావని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసిన మహిళా వైద్యురాలు, తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక కార్యం కోసం, ఓరల్ సెక్స్ కోసం  బలవంతం చేస్తున్నాడని కోర్టుకు తన బాధను తెలియజేశారు. అయితే, ఈ ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్ధీవాలా పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో అత్యాచారం గురించి ఇందులో పేర్కొనలేదన్నారు. కాకపోతే అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marital rape an injustice  marital rape  Rape  gandhinagar  CBI  CID  Gujarat High Court  

Other Articles