IPS officer’s daughter abusing police constable డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన ఐపీఎస్ అధికారి కూతురు

Daughter of ips officer abuses constable after caught in drunk driving check

Tamil nadu police, chennai police, Tamil nadu ADGP, Tamilselvan, police constable, ips officers, ips officer in tamil nadu, marina beach, drink and drive, viral video, Chennai, VIP racism, Tamil Nadu, Drink driving

If the reports are to be believed, the woman’s car was stopped after the policeman suspected that a couple of people inside her car were consuming liquor. After the ruckus, the woman and her friends filed a complaint against the police constable with the Police Commissioner’s office.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐపీఎస్ అధికారి కూతురు.. ఉద్యోగం ఊస్టింగ్ కు సిఫార్సు..

Posted: 04/03/2018 02:43 PM IST
Daughter of ips officer abuses constable after caught in drunk driving check

ఆయన ఓ సాధారణ కానిస్టేబుల్. తన అధికారుల అదేశాల మేరకు అనుమానాస్పందంగా కనిపించిన వాహనాలను అపి.. కారు నడుపుతున్నవారు మద్యం సేవించి వున్నారా.? లేక లేదా.? అన్న వివరాలను చెక్ చేసి.. మద్యం సేవించిన వారిని పక్కన నిల్చోబెడుతూ.. తన విధులు తాను నిర్వహిస్తున్నాడు. ఇంతలో అటుగా ఓ కారు వచ్చింది. కారులోని యువతి పూటుగా మందుకొట్టి, మద్యం సీసాతో వెళ్తూ, పోలీసులకు పట్టుబడింది. కారు దిగుతూనే నా కారునే అపుతావా..? నేను ఎవరో తెలుసా అంటూ కొందరు ప్రముఖులు, వారి పిల్లలు చెప్పినట్లుగానే రోటిన్ డైలాగులు చెప్పింది.

అంతేకాదు మరో అడుగు ముందుకేసీ 'నీ ఉద్యోగం ఊడగొడతా'నని కానిస్టేబుల్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి బెదిరింపులను అనేక మంది నుంచి ఇదివరకే వచ్చిన నేపథ్యంలో ఎవరైతే నాకేంటీ అన్న ధోరణిలో వ్యవహరించిన కానిస్టేబుల్ సదరు యువతి మాట్టాడిన మొత్తాన్ని రికార్డు చేసిన కానిస్టేబుల్ దానిని కూడా భద్రపర్చాడు. ఇలా అబద్దాలు కూడా చెప్పి పోలీసులతో ఎదురుతిరిగి తప్పించుకునే కేటుగాళ్లు కూడా వుండటంతో ఆయన ఈ పనిచేశాడు. అయితే కారులోని యువతి మాత్రం చెప్పింది నిజమే. అమె ఎవరో కాదు తమిళనాడు ఏడీజీపీ తమిళసెల్వన్ కూమార్తె.

దీంతో సహజంగానే వుండే పరపతి కన్నా.. ఆ యువతిలో కొంత అధికంగా వుండటంతో కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్‌ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయిస్తాను’ అంటూ చిందులేసింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని పాలవక్కం బీచ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తన కారును అపిన కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించాలని తన తండ్రికి ఘటనాస్థలం నుంచే ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేసింది. ఈ తతంగం మొత్తాన్ని ఆ కానిస్టేబుల్ వీడియో తీయడంతో ఇది వైరల్ గా మారింది. దీంతో ఆమె నేరుగా కమీషనరేట్ కు వెళ్లి కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించాడని, వద్దని వారిస్తున్నా వీడియో తీసి, తమకు ఇబ్బంది కల్పించాడని, అతనిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles