Actor complained against her husband భర్తపై నటి ఫిర్యాదు.. అక్రమ సంబంధం కోసం తన హత్యకు కుట్ర

Actress alleges sexual harrassment and domestic voilence by husband

actress chaitra, husband, sexuall harassment, illegal affair, domestic voilence, Chitra, liquor business, balaji pothraj, entertainment, movies, tollywood

Kannada Actress Chaitra Poth Raj, who has acted in Kannada Films such as Kushi and Shishya is planning to divorce. She has filed a dowry harassment case against her husband Balaji Pothraj at Basavugudi Womens Police Station

భర్తపై నటి ఫిర్యాదు.. అక్రమ సంబంధం కోసం తన హత్యకు కుట్ర

Posted: 03/21/2018 01:01 PM IST
Actress alleges sexual harrassment and domestic voilence by husband

నటీమణుల వైవాహిక జీవితాలు గాలిలో దీపాలనే చెప్పాలి. వారికి ఎప్పుడు, ఎలాంటి ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చిపడతాయో తెలియక.. అనుక్షణం తమ బంధాలు సవ్యంగా సాగాలని నిత్యం దేవుళ్లను కోరుకుంటారు. అయినా ఏదో ఒక్క చోట.. తెరపై నటించిన నటీమణులకు తమ భర్తల చేతిలోనే ఇబ్బందులు, కష్టాలు తప్పవు. తాజాగా  ప్రముఖ కన్నడ నటి చైత్ర కూడా అలాంటి పరిస్థితుల్లోకే నెట్టివేయబడింది.

దీంతో తన భర్త శాడిజాన్ని తట్టుకోలేక బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మద్యం వ్యాపారి, రియల్టర్ వ్యవహారాలు నడిపించే తన భర్త బాలాజీ పోతరాజ్ ఓ అమ్మాయితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడని అరోపించింది. దీంతోనే తనను అడ్డు తొలగించుకోవాలని తనపై అత్యంత దారుణంగా హింసకు పాల్పడుతున్నాడని పిర్యాదులో పేర్కోంది. బాలాజీ పోతరాజ్ తో  తో 2006లో వివాహమైందని చెప్పిన ఆమె.. ఇన్నాళ్లు తన మద్య సంసారజీవితం సజావుగానే సాగిందని చెప్పింది.

అయితే అమూల్యా అనే యువతితో అక్రమ సంబంధం నేపథ్యంలోనే గత నెల రోజులుగా తన భర్త తనను మానసిక, శారీరిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కోంది.  తాను ఎక్కడకు వెళ్లినా గన్ మెన్ ను నా వెంట పంపుతున్నాడు. ఈ నెల 14న చిన్న విషయానికి గొడవపడి తనపై దాడి చేశాడు. తలను గోడకేసిన కొట్టాడు. నోరు, ముక్కు నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోలేదని అరోపించిన అమె ఆ క్షణంలోనే తన ప్రాణాలు పోయాయని భావించానని అవేదనను వ్యక్తం చేసింది.

తన గొంతు పట్టుకుని పొట్ట, ఇతర భాగాలపై దాడి చేశాడని. తాను స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో పడేసి వెళ్లిపోయాడని, తనకు సృహ వచ్చే వరకు తాను అనాధజీవిలా పడివున్నానని భాదను వెల్లడించింది. అమూల్యతో వివేహేతర సంబంధం నేపథ్యంలో తనను తొలగించుకునేందుకు తన భర్త ఈ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాడని అరోపించింది. ప్రస్తుతం తన పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నానని చెప్పింది. తన భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles