komati reddy venkat reddy sensational comments on kcr నా హత్యకు సీఎం కుట్ర: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komati reddy venkat reddy sensational comments on kcr

congress mla, Komatireddy Venkatreddy, CM KCR, murder plan allegations, sampath, gunmans, nalgonda, telangana, politics

congress senior leader komati reddy venkat reddy sensational comments on Telangana CM KCR, alleges he is in skecth of his murder, that is why he removed his along with sampath gunmans

నా హత్యకు సీఎం కుట్ర: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Posted: 03/21/2018 01:56 PM IST
Komati reddy venkat reddy sensational comments on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రభుత్వంపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను కూడా హత్య చేసేందుకు తెర వెనుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని సంచలన అరోపణలు చేశారు. తన సహచర బహిష్కృత ఎమ్మెల్యే సంపత్ తో పాటూ తనకు గన్ మెన్లను ఉపసంహరించడం వెనుక తనను హతమార్చేందుకు పెద్ద కుట్ర ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తనను తన నియోజకవర్గంలో ఎదుర్కోనడంలో విఫలమైన అధికార పార్టీ.. హత్య రాజకీయాలో తన నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని కుతంత్రాలు పన్నుతుందని అరోపించారు.

ఇప్పటికే తన కుడిభుజం లాంటి సోదరసమానుడైన మున్సిపల్ ఛైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య చేయించిన అధికార పార్టీ. అదే తరహాలోనే తనను కూడా చంపేందుకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తనకేం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పేంత పిరికిపందను కాదన్నారు. కేసీఆర్ బుల్లెట్ కంటే తన గుండె గట్టిదన్నారు కోమటిరెడ్డి. బొడ్డుపల్లి శ్రీను హత్య కేసులో నిందితులకు మూడు రోజుల్లో బెయిల్ ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ హత్య వెనుక ఎమ్మెల్యే వీరేశం హస్తం ఉందని... అయినా చర్యలు లేవన్నారు. అలాగే తనపై కూడా ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అల్లుడు హరీష్ రావు గవర్నర్ కుర్చీలను లాగేసి... శాసనమండలిలో టేబుల్‌పై ఎక్కి కొట్టినప్పుడు ఎవరినీ కూడా అనర్హులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం తమపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు సీఎంకు ఎక్కడిదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సంప‌త్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీని కలిసి... రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరనున్నారు. పనిలో పనిగా రాహుల్‌ను కూడా కలవనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles