Undavalli thrashes allegations on pawan by TDP ‘పోలవరం’లో అవినీతి.. తగిన సమయంలో భయటపెడతా: ఉండవల్లి

Undavalli thrashes allegations on pawan by tdp

undavalli arunkumar, pawan kalyan, chandrababu, polavaram, national project, undavalli thrashes Tdp allegations on Pawankalyan, Jana Sena, joint fact finding commitee, polllavaram corruption, Andhra pradesh Special status, andhra pradesh, politics

Renowned Politicain Undavalli Arun Kumar thrashes all the allegations made by ruling chandrababu naidu on janasena chief pawan kalyan, said jfc had even sought out on polavaram project where a heavy number of corruption has taken place.

‘పోలవరం’పై అనేక విషయాలను దాచిన చంద్రబాబు.?: ఉండవల్లి

Posted: 03/21/2018 12:19 PM IST
Undavalli thrashes allegations on pawan by tdp

టీడీపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే అలాంటి వ్యక్తిపై కూడా టీడీపీ అనుచిత విమర్శలు చేస్తూ.. ఆయన చర్యలను తప్పుబటడం కూడా తప్పేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబుకు మంచోడిగా వున్న పనవ్ కల్యాన్ అయన ప్రభుత్వ హాయంలో జరుగుతున్నఅవినీతిని ప్రశ్నించగానే చెడ్డవాడిగా మారిపోయాడా..? అన్ని ప్రశ్నించారు.

జనసేన అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజనిర్థారణ కమిటీలో పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్రం ఇచ్చిన నిధులు, అక్కడ జరుగుతున్న పనులపై చర్చించామని  చెప్పిన ఆయన అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితి ఏర్పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఏ రోజుకారోజు కేంద్రానికి లెక్కలు పంపుతున్నామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. అసలు పోలవరం నిర్మాణం, చెల్లింపులపై ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం జరగలేదని విషయాన్ని తమ చర్చల వల్ల తెలుసుకున్నామని ఉండవల్లి వెల్లడించారు.

అంతేకాదు పోలవరంపై ఇప్పటివరకు జరిగిన ఏడు సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాకపోవడం వెనుక అంతర్యమేమిటో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు ఉండవల్లి. ఇక పోలవరం పరిహారం చెల్లింపుల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని తమ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ చర్చల్లో  భాగంగా తెలిందని అన్నారు. తడ్వాయి, చెల్లవారి గూడెంలో 1300 ఎకరాల పోరంబోకు భూములకు కూడా పరిహారం చెల్లించారన్న అరోపణలు వున్నాయని అయన తెలిపారు.

అయితే త్వరలోనే తాను పొలవరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాలను బయటపెడతానని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా అవిశ్వాస తీర్మాణంపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఇక పనిలోపనిగా చంద్రబాబుకు నేరుగా ప్రశ్న సంధించిన ఉండవల్లి.. మోడీతో ఆయనకు ఉన్నది మిత్రృత్వమో లేక శత్రుత్వమో ఆయనే భయపెట్టాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles