Parliament logjam adjourns both Houses for the fourth day అవిశ్వాసంపై మూడో రోజు సేమ్ సీన్.. ఉభయసభలు వాయిదా

Ls rs adjourned on 4th consecutive day no trust motions disallowed again

TDP, YSRCP, no confidence motion, council of minister, prime minister, PM Modi, Union Govenment, Andhra pradesh, special status, congress, trinamul congress, left parties, national congress party, biju janatadal, andhra pradesh special status, TRS, AiADMK, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, andhra pradesh, politics

The Lok Sabha proceedings were disrupted by the TRS, AIADMK party for the fourth day on Wednesday. Lok Sabha Speaker Sumitra Mahajan disallowed for the fourth time no-confidence motions against the government, citing a disorderly House.

నాల్గవరోజు ఉభయ సభల్లో మార్పులేదు.. అవిశ్వాసం ఊసేలేదు..

Posted: 03/21/2018 11:39 AM IST
Ls rs adjourned on 4th consecutive day no trust motions disallowed again

పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు కొనసాగిస్తున్న నిరసనలు యధావిధిగా నాల్గోవ రోజు కోనసాగాయి, నాల్గో రోజు కనీసం అంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన కూడా లేకుండానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ నాలుగు నిమిషాల పాటు సాగినా.. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అజాద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై, వర్గీకరణ విషయమై అర్టికల్ 90 కింద చర్చజరగాలని, అలాగే ఏపీ ప్రత్యేక హోదా విషయం, కావేరీ జలాలు, బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న స్కామ్ లపై కూడా చర్చజరగాలని అజాద్ చెప్పారు.

దీంతో వాటిపై నోటీసులు ఇవ్వాలని చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని చట్టప్రకారమే జరుగుతాయని, దేనికీ మినహాయింపు వుండదని కూడా చెప్పారు. అయితే వెల్ లోకి దూసుకోచ్చిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ బిగరగా నినాదాలు చేయడంతో సభలో గంధగోళరం ఏర్పాడింది. దీంతో సభను చైర్మన్ వెంకయ్యనాయుడు ఆరు నిమిషాలలోపు గురువారానికి వాయిదా వేశారు.

అంతకుముందు లోకసభ ప్రారంభంగాకాగానే విపక్షాలు టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు అందోళన చేపట్టడంతో కేవలం నిమిషం వ్యవధిలోనే సభను మధ్యహ్నాం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తరువాత 12 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో ఏలాంటి మార్పు లేకపోవడంతో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి అనంతకుమార్ విపక్ష సభ్యులను శాంతించాలని కోరారు. తాము అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్దంగా వున్నామని చెప్పారు.

సభతో పాటు సభ బయల ప్రజానికానికి కూడా అన్ని నిజానిజాలు తెలియడానికి తమ పార్టీ అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్దంగా వుందని అన్నారు. అయితే అప్పటికే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాన్ని సభలో చదవి వినిపించారు. అయినా సభలో విపక్షాలు నిరససలు కోనసాగించాయి. విపక్ష సభ్యులు తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ కోరినా వారు నిరాకరించారు. దీంతో సభ అర్డర్ లో లేనందున తాను అవిశ్వాసంపై చర్చను కొనసాగించడం లేదని అమె అన్నారు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  no confidence motion  TRS  AiADMK  BJP  PM Modi  sushma swaraj  Andhra pradesh special status  

Other Articles