mumbai call girl held in vijayawada కస్టమర్ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కిన కాల్ గాళ్..

Mumbai call girl held in vijayawada on hotel staff complaint

mumbai call girl held in vijayawada, mumbai call girl arrested, mumbai call girl suspicious behaviour, mumbai call girl hanuma naik, mumbai call girl hotel staff, call girl, mumbai, vijayawada, Hanuma nayak, online prostitution, vijayawada police, hotel staff, Andhra pradesh, crime

A call girl from mumbai arrived in vijayawada for the one named Hanuma nayak, who booked her online and made payments, was held by police of her suspicious behaviour.

కస్టమర్ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కిన కాల్ గాళ్..

Posted: 02/19/2018 05:35 PM IST
Mumbai call girl held in vijayawada on hotel staff complaint

ఆమె ఒక యువతి.. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వాలింది. అమె వ్యాపారం ఈజీ మని. అంటే ఏదో అనుకునేరు.. సుఖాన్ని అందించడం.. అయితే అమెకు పొట్ట చించితే కూడా తెలుగు అక్షరం రాదు. అంతా హిందీ, ఇంగ్లీషు మాత్రమే. కానీ అమె ప్రవర్తన మాత్రం హోటల్ సిబ్బందికి అనుమానం రేకెత్తించేలా చేసింది. ఇక వారు ఉండబట్టలేక పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పుడే అమె డొంక కదిలింది. సీరియస్ గా తీసుకుంటే ఓ పెద్ద రాకెట్ గుట్టుకూడా రట్టయ్యే అవకాశం వుంది.

అన్ లైన్ మాద్యమాన్ని అక్రమార్కులు కూడా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని చెప్పడానికి.. ఈ ఘటనే ఒక నిదర్శనం. ముక్కూ మొహం తెలియని ఓ వ్యక్తి కోసం ఓ యువతి ఏకంగా రాష్ట్రం కాని రాష్ట్రంలో కాలుపెట్టిందంటే.. అక్రమార్కులు ఏ రేంజిలో తమ దందాలను కొనసాగిస్తున్నారో అర్థ: చేసుకోవచ్చు. అన్ లైన్ ద్వారా విటులను అకర్షించే ఓ సంస్థలో కాల్ గాళ్ గా చేరిన యువతిని.. విజయవాడకు చెందిన ఓ విటుడు బుక్ చేసుకున్నాడు. అతని సూచనల ప్రకారం అమె పటమటలో వున్న ఓ లాడ్జీలో దిగింది.

తన విటుడు రావడానికి అలస్యమవుతుందని అనుకుందో ఏమో హోటల్ సిబ్బందితో మాట్లాడుతూ పలు ప్రశ్నలను సందించింది. అయితే అమె హిందీ అర్ధంకాకపోయినా.. హోటల్ సిబ్బందికి మాత్రం అనుమానాలు రేకెత్తాయి. తమ హోటల్ ఇమేజ్ ను అప్రతిష్టపాలు చేయడానికి ఎవరైనా ఈమెను ఇక్కడకు పంపారా..? అన్న అనుమానాలు కూడా హోటల్ యాజమాన్యానికి కలిగాయి. దీంతో ముందుగానే మేల్కొన్న హోటల్ యాజమాన్యం తమ హోటల్ లో ఓ యువతి దిగిందని, అమె ధోరణి చూస్తుంటే అనుమానాస్పందంగా వుందని పిర్యాదు అందించింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా అమెను విచారించే క్రమంలో అమె కాల్ గాళ్ అని, విజయవాడకు చెందిన హనుమా నాయక్ అమెను బుక్ చేసుకున్నాడని, అన్ లైన్ ద్వారా అమెకు డబ్బును కూడా చెల్లించాడని తెలుసుకున్న పోలీసులు అతడి గురించి అన్వేషణ ప్రారంభించారు. అమెకు చెందిన బ్యాంకు అకౌంట్ లో ఏ అకౌంట్ నుంచి డబ్బులు అందాయన్న వివరాలను కూడా కూపీలాగుతున్నారు. కాగా అన్ లైన్ ద్వారా ఈ రాకెట్ చడీచప్పుడు కాకుండా గుట్టుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుందని వెలుగులోకి రావడంతో అసలు రాకెట్ గుట్టును కూడా చేధించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles