Singaporeans to get SG Bonus of up to S$300 మోడీ ఎన్నికల హామీ.. అక్కడ ఇలా అమలు..

All adult singaporeans to get one off bonus of up to s 300

Singapore, 2017 Budget, surplus, 'hongbao' Bonus, SG Bonus, Finance Minister, Heng Swee Keat,, income groups, India, PM Modi, Election Promise, black money, foreign banks

All Singaporeans aged 21 and above this year will get a one-off SG Bonus of up to S$300 each as the Budget for 2017 came in with a surplus of almost S$10 billion.

ప్రధాని మోడీ ఎన్నికల హామీ.. అక్కడ ఇలా అమలు..

Posted: 02/19/2018 06:28 PM IST
All adult singaporeans to get one off bonus of up to s 300

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు పేదలు, మధ్యతరగతి వర్గాల వారిని అకర్షించడానికి ఓ ఎన్నికల హామీని ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా.. ఆ హామీకి సంబంధించిన దఖాలాలు కానీ. అవి అచరణ సాథ్యం అవుతాయన్న సంకేతాలు కానీ కనిపించడం లేదు. దేశంలోని ప్రతీ నిరుపేదల, మధ్యతరగతి ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలను వేస్తామని ఆయన హామీ అసలు అమలు అవుతుందా..? ఇది అచరణ సాధ్యమేనా అంటే విశ్లేషకులు మాత్రం కాదని చెబుతున్నా.. నేతలు మాత్రం సాధ్యమేనని ప్రజల్లో అశలను సజీవంగానే వుంచుతున్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా తమది కానిది తమ జన్ ధన్ ఖాతాల్లోకి రాలేదని ప్రజలు అరోపిస్తున్నారు.

అయితే అక్కడ మాత్రం ప్రధాని హామీ అమలుకు నోచుకునోంది. అయితే దాని రూపం మాత్రం వేరు. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానన్న మన ప్రధాని అధికారంలోకి వచ్చిరాగానే పన్నులు పెంచి సామాన్యుల జేబులను గుళ్ల చేస్తుంటే.. అక్కడి ప్రభుత్వం మాత్రం ఎలాంటి మాటలు ఇవ్వకపోయినా, హామీల కాకపోయినా.. ప్రజల నుంచి మిగులు బడ్జెట్ రావడంతో.. దానిని ఇతరాత్రాలకు వినియోగించకుండా.. మళ్లీ ప్రజలకే పంచి నూతన అద్యాయానికి తెరతీస్తుంది. మిగులు బడ్జెట్ గా వచ్చిన మొత్తాన్ని ప్రజలకు బోనస్ గా పంచనుంది. ఈ తరహా సరికొత్త కార్యక్రమానికి తెరతీసింది సింగపూర్ ప్రభుత్వం. తమ మిగులు బడ్జెట్‌ను ప్రజలకు పంచడానికి రెడీ అవుతోంది.

పేదలు, సంపన్నులను మినహాయించి కేవలం మధ్యతరగతి వారినే టార్గెట్ చేసి వారి జేబుల్లోంచి డబ్బును లాక్కునేందుకు పన్నులకు కొత్త పేర్లు పెట్టే.. ప్రజలను మాత్రం హామీల బూచీతో డొలాయమానంలో ముంచుతూ.. తమ పాలన సాగిస్తున్నాయి. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా సింగపూర్ ప్రభుత్వం పథకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతేడాది సింగపూర్ ప్రభుత్వానికి 7 బిలియన్ల అమెరికన్ డాలర్లు మిగులు బడ్జెట్ వచ్చింది. దీంతో ఆ దేశ ఆర్థికమంత్రి హెంగ్ స్వీ కీట్ మిగులు బడ్జెట్ ను ప్రజలకు బోనస్ గా అందిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. 21 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుల ఖాతాల్లోకి డబ్బును వేస్తామని ప్రకటించారు. 28 వేల ఆదాయం ఉన్నవాళ్లకు 300, 28వేల నుంచి లక్ష ఆదాయం ఉన్నవారికి 200, అంతుకు మించిన అదాయం వున్నవారికి 100 సింగపూర్ డాలర్లు వేయనున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles