మగమృగాళ్ల అటవిక చర్యల్లో అఘాయిత్యాలకు గురై.. గెండెనిండా అవేదనతో బాధపడే బాధితుకు సంఘంలో తెలత్తుకుని తిరిగేలా చేయాల్సిన ప్రభుత్వాలు.. వారికి కేవలం రూ.6 వేల రూపాయలను పరిహారంగా ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నాయా..? లేక తమ ధాతృత్వాంతో రూ.6 వేలను అందిస్తున్నాయా..? అని నిగ్గతీసి అడిగింది.
"అత్యాచార బాధితులకు పరిహారం కింద ఆరు వేలేనా? ఇవ్వడం...మీరేమైనా 'చారిటీ' నడిపిస్తున్నరా?" అంటూ మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ తమ రాష్ట్రంలోని ఒక్కో అత్యాచార బాధితురాలికి ఆరు వేల రూపాయల నుండి ఆరువేల ఐదు వందల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తుండం ఏంటని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది.
మధ్యప్రదేశ్ లో అత్యాచార బాధితుల పరిహారానికి సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడెవిట్ ను పరిశీలించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. కేసు విచారణలో భాగంగా జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మసానం తప్పుబట్టింది. అసలు అత్యాచార బాధితులకు రూ.6500 పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్థారించిందని సుప్రీం ధర్మాసనం అక్షేపించింది.
మధ్యప్రదేశ్లో మొత్తం 1951 మంది అత్యాచార బాధితులున్నారని వారిలో ఒక్కోక్కరికి రూ.6500 చొప్పున పరిహారాన్ని ఎలా నిర్ణయిస్తారు? అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 'అసలు ఒక్కో అత్యాచారాన్ని రూ.6500 అని ఎలా లెక్కగడుతారు? ఇది పూర్తిగా స్పృహలేనితనం' అంటూ ధర్మాసనం మండిపడింది. నిర్భయ నిధి కింద అందుకున్న నిధుల తాలూకూ వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు గతనెల ఆదేశించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more