teacher implements superstitious method with students మూడ విశ్వాసాలను ఆశ్రయించిన ఉపాధ్యాయురాలు.. డబ్బు కోసమే..

Teacher implements superstitious method with students

government Teacher, rapally goverment school, gollapally mandal, Jagithyal district, superstitious method, school students, RS 200, Telangana, crime

A government Teacher of rapalli school in gollapally mandal of Jagithyal district, implements superstitious method with students, to get back her lost RS 200, she thinks that they had robbed it.

మూఢవిశ్వాసాలను ఆశ్రయించిన ఉపాధ్యాయురాలు.. డబ్బు కోసమే..

Posted: 02/16/2018 10:21 AM IST
Teacher implements superstitious method with students

విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించాల్సిన ఓ టీచర్ మూఢనమ్మకాలను అచరించడంతో పాటు విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. భావితరాలలో మూడ విశ్వాసాలను తొలిగించాల్సిన ఉపాధ్యాయురాలు వాటిని పాటించడం కలకలం రేపుతొంది. తన పాఠశాలలోని విద్యార్థులకు పసుపు బియ్యం పెట్టింది. అందరు విద్యార్థులను వాటిని తినాలని చెప్పింది. ఎందుకిలా అంటే పాఠశాలలో తాు పోగొట్టుకున్న రూ.రెండు వందల కోసం విద్యార్థులపై దొంగ తనం నెపం మోపింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

రాపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొత్తం 19 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్ గా పనిచేస్తున్న రజిత పర్సులోని రూ.200 ఈ నెల 6వ తేదీన పోయాయి. విద్యార్థులే తనడబ్బులు దొంగిలించినట్లు ఉపాధ్యాయురాలు భావించింది. మరుసటి రోజు టీచర్‌ పసుపు బియ్యంతో పాఠశాలకు వచ్చింది. 12 మంది విద్యార్థులకు వాటిని పెట్టింది. బియ్యం తిన్నవారు తన డబ్బులు తీయలేదని, తిననివారు దొంగతనం చేసినట్లే అని చెప్పింది. తీసినవారు మరుసటి రోజు డబ్బులు తెచ్చి ఎవరికీ చెప్పకుండా ఇవ్వాలని లేకపోతే చచ్చిపోతారని బెదిరించింది. దీంతో చేసేది లేక విద్యార్థులు పసుపు బియ్యం తిన్నారు.

ఈ విషయం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో గ్రామంలో శివరాత్రి జాతర ఉండటం, పాఠశాలకు సెలవులు వచ్చాయి. పాఠశాల గురువారం ప్రారంభం కావడంతో జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి టీచర్‌ రజితను నిలదీశారు. పసుపు ఆంటీబయాటిక్‌ అని ఇది తింటే ఏమీ కాదని దొంగతనం చేసిన డబ్బులు తిరిగి తెస్తారని ఇలా చేసానని తల్లిదండ్రులతో టీచర్‌ చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు టీచరుపై చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles