CM Siddaramaiah welcomes SC order కావేరీ జలాలపై సుప్రీం తీర్పు.. స్వాగతించిన సిద్దూ..

Cauvery verdict setback says tamil nadu as karnataka cheers order

supreme court, Agriculture,Cauvery Management Board, Cauvery water dispute, Cauvery Water Dispute Tribunal, Cauvery water sharing, Chief Justice Dipak Misra, Inter-State Water Disputes Act 1956, Karnataka, Kaveri‬, Kerala, Puducherry, Tamil Nadu, ‪Karnataka‬,‪ Kaveri River water dispute‬,‪ Tamil Nadu news, updates, latest updates, latest news, news online

The Supreme Court ordered the Karnataka government to release 177.25 tmcft (1,000 million cubic feet) of water to Tamil Nadu Friday. The figure is significantly lower than the 192 tmcft the Cauvery Disputes Tribunal asked it to give its neighbour.

కావేరీ జలాలపై సుప్రీం తీర్పు.. స్వాగతించిన సిద్దూ..

Posted: 02/16/2018 12:00 PM IST
Cauvery verdict setback says tamil nadu as karnataka cheers order

శతాబ్ద కాలానికి పైగా మూడు రాష్ట్రాల మధ్య వివాదానికి అజ్యం పోసిన కావేరీ నదీ జలాల ఫంఫిణీ విషయంలో ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. మరీ ముఖ్యంగా కర్ణాటకకు, తమిళనాడు రాష్ట్రాలకు మధ్య సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు బంధుత్వాలను కూడా కలుపుకునేందుకు అయిష్టతను వ్యక్తం చేసేంతగా కావేరీ నదీ జలలా విషయంలో వివాదమే కారణమైంది. అయితే ఈ విషయంలో తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు. నదులపై తమ అదిపత్యం కొనసాతుందని ఏ రాష్ట్రం చెప్పడానికి అర్హత లేదని. జలాలపై తమకే ఓనర్ షిఫ్ హక్కులు వున్నాయని వాదించడం సహేతుకం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.

తమిళనాడుకు 177.25 టీఎంసీల జలాలు కేటాయించగా, కర్ణాటకకు 284.75 టీఎంసీల జలాలను అత్యున్నత న్యాయస్థానం కేటాయించింది. ఆ ప్రకారం కర్ణాటకకు అదనంగా 14.5 టీఎంసీల నీరు లభిస్తుంది. కేరళ, పుదుచ్చేరికి జలాల కేటాయింపుల్లో మార్పు లేదు. ట్రిబ్యునల్ గతంలో 30 టీఎంసీల జలాలు కేరళకు, 7 టీఎంసీల జలాలు పుదుచ్చేరికి కేటాయించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) 2007లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై ఎనిమిది నెలల్లో 28 రోజుల పాటు విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ ఇవాళ తీర్పును వెలువరించింది.
 
కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి చెక్కెదురు కాగా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్పందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సర్వెన్నత న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పూర్తి తీర్పు పాఠాన్ని చదివిన తరువాత కానీ తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదనని చెప్పారు. ఇక తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ఎంపీ నవనీత కృష్ణన్ ఇది తమ రాష్ట్రానికి ఎదురుదెబ్బేనని అన్నారు. అయితే తీర్పు పూర్తి పాఠం చదివిన తరువాత కానీ తాము ఈ విషయంలో అవగాహనకు రాలేమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cauvery  Supreme Court  Verdict  Cauvery water dispute  Tamil Nadu  Karnataka  kerala  puducherry  

Other Articles