pawan kalyan tributes to Ambedkar before JFC meet సత్యాన్వేషణకు ముందు అంబేద్కర్ కు పవన్ నివాళులు

Pawan kalyan tributes dr br ambedkar before jfc meet

Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JAC, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

Power Star, Janasena President Pawan kalyan to Hold JFC Meeting with JP, Undavalli & other politcians at Daspalla hotel in Hyderabad.

సత్యాన్వేషణ దిశగా పవన్ కల్యాన్ తొలి కీలక అడుగు..

Posted: 02/16/2018 08:49 AM IST
Pawan kalyan tributes dr br ambedkar before jfc meet

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ కేంద్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో, ఎక్కడ అన్యాయం జరిగిందన్న విషయంలో సత్యాన్వేషణ దిశగా ఇవాళ తొలి అడుగువేస్తున్నారు. సంయుక్త నిజనిర్ధారణ కమిటీ అద్వర్యంలో అటు జయప్రకాష్ నారాయణ, ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో పలువురు మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నేతలతో పవన్ కల్యాన్ ఇవాళ హైదరాబాద్ నగరంలోని దసపల్లా హోటళ్లో తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ప్యాకేజీ నిధుల అంశంమై చర్చించనున్నారని సమాచారం.

కాగా, జేఎఫ్సి (జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ) సమవేశానికి బయలుదేరే ముందు జనసేనాని ట్యాంకు బండుపైనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాది సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోగా, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన కార్యాలయం నుంచి వందలాది మంది అభిమానులు పవన్ కల్యాన్ తో.. కలసి కేరింతలతో వెంట వచ్చారు. ట్రాపిక్ ఇబ్బందుల నేపథ్యంలో పవన్ కల్యాన్ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెనుదిరిగారు.

పవన్ చొరవతో ఏర్పాటు అవుతున్న ఈ సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు,  ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు. ఇక కొంతమంది ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులను సైతం పవన్ ఆహ్వానించారని, వారు కూడా సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles