Class 12 girl gang-raped in West Bengal బర్త్ డే పార్టీకి వచ్చిన స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్

Class 12 girl student gang raped by friends at birthday party

Class 12 girl, South 24 Parganas Rathtala, West Bengal, birthday party, gang rape, crime

A class 12 student was allegedly raped and seriously injured by four of her friends at a birthday party at Rathtala in South 24 Parganas district of West Bengal.

బర్త్ డే పార్టీకి వచ్చిన స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్

Posted: 02/16/2018 09:29 AM IST
Class 12 girl student gang raped by friends at birthday party

యువతులు అప్రమత్తంగా వ్యవహరించాలని దేశంలో నమోదవుతున్న అనేక ఘటనలు స్పష్టం చేస్తునేవున్నాయి. అయితే తనతో పాటు చదువుకుంటున్న తోటి విద్యార్థులు, స్నేహితులు కావండంతో వారు పిలిచిన బర్త్ డే పార్టీకి వెళ్లడమే ఆ యువతి పట్ల శాపమైంది. స్నేహితులే అని నమ్మివెళ్లిన అమెపై పైశాచిక మృగాళ్ల మాదిరిగా తెగబడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో అగకుండా అమెను హతమార్చేందుకు కూడా యత్నించారు. అది కుదరకపోవడంతో అలాగే వదిలేసి వెళ్లారు.

పశ్చిమబెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, రత్తాలలో విద్యార్థినిపై, అమె స్నేహితులే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను చంపేందుకు ప్రయత్నించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో.. గాయాల పాలైన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. తన అంకుల్ ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్నానని, రావాల్సిందిగా 12వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలైన బాలికను నిందితుడు ఆహ్వానించాడు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వెళ్లడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. సాయంత్రం పొద్దుపోయాక బాలిక ఆ ఇంటికి వెళ్లగా ఆమె స్నేహితుడు మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతున్నాడు.

ఆమె రావడంతో మద్యంలో డ్రగ్స్ కలిపి ఆమెతో బలవంతంగా తాగించాడు. స్పృహ తప్పి పడిపోయిన ఆమెపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేందుకు ప్రయత్నించినా కుదరకపోడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Class 12 girl  South 24 Parganas Rathtala  West Bengal  birthday party  gang rape  crime  

Other Articles