Isaac pressed for austerity, spent on a massage ప్రజాధనంతో అమాత్యుల వారి అయిల్ మసాజ్..

No austerity for kerala fin min isaac claims rs 1 20 lakh for oil massage

LDF minister, kerala finance minister, speaker sreeramakrishnan, Kottakkal Arya Vaidyashala, Malappuram, Thomas isaac, Thomas isaac bill, Thomas isaac kottakkal, Thiruvananthapuram, Kerala, Politics

LDF minister Thomas Isaac got Rs 1.20 lakh reimbursed for taking a 14-day treatment at an Ayurveda centre in December 2016. Of the total billed amount from Kottakkal Arya Vaidyashala, Rs 80,000 amounts to accommodation charges,

ప్రజాధనంతో అమాత్యుల వారి అయిల్ మసాజ్..

Posted: 02/05/2018 02:54 PM IST
No austerity for kerala fin min isaac claims rs 1 20 lakh for oil massage

పద్దులన్నీ ప్రజలకు.. పోదుపు మంత్రం సామాన్యులకు, కానీ తమకు ఇవేమీ పట్టవని తేల్చిచెబుతున్నారు ప్రభుత్వ పాలకులు. అసెంబ్లీలో గత వారం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేరళ అర్థిక శాఖ మంత్రి టీఎస్ థామస్ ఇస్సాక్ వ్యవహర తీరు కూడా ఇలాగే వుంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వ్యయాలను తగ్గిస్తూ కఠినమైన నిర్ణయాలను తీసుకున్నానని చెప్పిన మంత్రిని వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజలు, ప్రతిపక్ష నేతలు అతనిపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు.

ప్రజలకు పోదుపు సూత్రాలు చెప్పిన మంత్రివర్యులు తన సొంత వైద్య చికిత్స ఖర్చుల కోసం ఏకంగా లక్షా 20 వేల ప్రజాధనాన్ని ఎలా వెచ్చిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే అందులో మూడింత రెండోంతులు కేవలం అతని వసతి సౌకర్యం కోసమే ఖర్చు కావడం వివాదానికి, విమర్శలకు దారితీసింది. 2016 డిసెంబరులో కొట్టకల్‌ ఆర్య వైద్యశాలలో థామస్ మసాజ్‌ చికిత్స చేయించుకున్నారు. మొత్తం బిల్లు రూ.1.20 లక్షలు కాగా, రూమ్‌ అద్దె‌ రూ.80 వేల ప్రభుత్వ సొమ్ము నుంచి కట్టినట్లు బహిర్గతమైంది.

దీంతో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు అయనపై విమర్శలు కురిపిస్తున్నారు. తిరువనంతపురంలో ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాఖ వుండగా, పొదుపు పద్దులు చెబుతున్న మంత్రివర్యులు ఎందుకని తిరువనంతపురానికి బదులు కొట్టకల్ ఆర్య వైద్యశాలలో చికిత్స చేయించుకన్నారని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు కేరళ స్పీకర్‌ శ్రీరామకృష్ణన్ రూ.50వేల ఖరీదైన కళ్లజోడుకు, అంతకుముందు రాష్ట్ర వైద్యఅరోగ్యశాఖా మంత్రి కెకె శైలజ తన కళ్లజోడు కోసం రూ, 28 వేల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి రీయంబర్స్‌మెంట్‌ ‌తీసుకుని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thomas isaac  oil massage  LDF  UDF  treatment  kottakkal  Politics  

Other Articles