Isaac pressed for austerity, spent on a massage కర్ణాటక రాజకీయాల్లోనూ మరో బాలయ్య..

Minister dk shivakumar loses his cool hits man trying to take selfie

Vijayanagara College Stadium, DK Shivakumar, selfies, energy minister, Belagavi, Hosapete, Karnataka, Politics

Karnataka Minister Shivakumar has made his dislike for selfies again. A video went viral showing him slapping away the hand of a man who was trying to take a selfie.

ITEMVIDEOS: కర్ణాటక రాజకీయాల్లోనూ మరో బాలయ్య.. మంత్రి శివకుమార్..

Posted: 02/05/2018 03:52 PM IST
Minister dk shivakumar loses his cool hits man trying to take selfie

నందమూరి నటసింహంగా పేరొందిన బాలయ్య.. రాజకీయ ప్రవేశం చేయడంతో అతనికి ఫాలోయింగ్ మరింత ఎక్కువైందనడంలో సందేహం లేదు. అయితే తన తండ్రి తెలుగువారి అరాధ్యదైవంగా బాసిల్లుతున్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మాదిరిగా సినిమాలను పక్కనపెట్టకుండా. అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమా రంగంలోనూ జోడుగుర్రాల స్వారీ చేస్తున్నారు. ఈ మధ్య అతని వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.. సినిమాను థియేటర్ లో వీక్షించి బయటకు వస్తున్న బాలయ్యను తన సెల్పీలో బంధించాలని యత్నించిన అభిమానికి పరాభావం ఎదురైన విషయం తెలిసిందే.

ఇదే తరహాలో కర్ణాటక రాజకీయాలలో కూడా మరో బాలయ్య వున్నారు. అయనే విద్యుత్ శాఖ మంత్రి డికే శివకుమార్. అదెలా అంటే అమాత్యులు శివకుమార్ కు కూడా సెల్ఫీలు దిగేందుకు నిరాసక్తిని కనబరుస్తారు. సరిగ్గా మూడు నెలల క్రితం అయన అభిమాని ఒకరు అయనతో సెల్ఫీ దిగేందుక ప్రయత్నించగా ఆయన దానిని విఫలం చేశారు. కాగా అదే ప్రయత్నం ఇవాళ మరోమారు మంత్రి శివకుమార్ అభిమానికి ఎదురైంది. కర్ణాటకలో ఈ నెల 10వ తేదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో ఆయన బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను శివకుమార్ పరిశీలించారు.

కర్ణాటకలోని హోసోపేటలోని బేలగావి పరిధిలోని విజయనగర కాలేజీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ అభిమాని ఆయ‌న‌తో సెల్ఫీ దిగ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు మంత్రి త‌న అభిమాని చేతిపై కొట్టాడు. దీంతో స్మార్ట్ ఫోన్ కింద‌ప‌డిపోయింది. ఈ స‌మ‌యంలో ఇత‌రులు త‌మ స్మార్ట్ ఫోన్ ల‌లో ఈ దృశ్యాన్ని బంధించి సామాజిక మాధ్య‌మాల్లో పెట్టారు. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. దీంతో అక్కడి తెలుగువాళ్లు మంత్రి గారు మరో బాలయ్య అంటూ పేర్కొనడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DK Shivakumar  selfies  energy minister  Belagavi  Hosapete  Karnataka  Politics  

Other Articles