actor nikhil says special status a must to AP ఏపీకి ప్రత్యేక హోదా అత్యంత అవసరం: నిఖిల్

Andra tdp mps protest in parliament against union budget

state bifurcation demands, TDP MPS protest in parliament, KVP Ramachander Rao, V.Hanmantha rao, TG Venkatesh, Parliament House, Telugu Desam Party, MPs, Union Budget, AP special status, Nitin, Actor, congress, tdp, janasena, Politics

TDP MPs including TG Venkatesh staged a protest in front of Gandhi Statue in Parliament House in New Delhi while raising slogans and holding placards to save Andhra Pradesh by doing justice.

విభజన హామీలపై ఎంపీలు గళమిప్పారు.. గొంతు కలిపిన నిఖిల్..

Posted: 02/05/2018 01:36 PM IST
Andra tdp mps protest in parliament against union budget

రాజధాని లేని రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్.. రాష్ట్ర విభజనతో అర్థిక లోటులోకి వెళ్లగా.. దానిని అదుకునేందుకు అన్ని విధాలగా సహకరిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటనలు చేసిన ప్రకటించిన నరేంద్రమోడీ.. ఇప్పుడు తన హామీలను నిలబెట్టుకోవాలని అంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర ఎంపీలు పార్టీల వారీగా విడిపోయి తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు, ప్రయోజనాలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.  ‘మాకు న్యాయం చేయండి.. ప్రధాని స్పందించాలి’ అంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు చేతబట్టారు. విభజనతో నష్టపోయిన రాష్టానికి  అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అన్యాయమైన రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేయవద్దని కోరారు. విభజన హామీలు నెరవేర్చకపోతారా అని చూస్తుంటే.. నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో కాంగ్రెస్‌..

రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రజలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీలను గుప్పించి.. గత నాలుగేళ్లుగా వాటి ప్రస్తావనే లేకుండా.. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకుండా, బడ్జెట్ లో కేటాయింపులు జరపడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు సభ్యులు ఆందోళన చేపట్టారు. కేవీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డుతగలొద్దని, సభ నిర్వహణకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడంతో కేంద్రం విఫలమైందని సభ్యులు ఆరోపించారు. గందరగోళం నేపథ్యంలో ఉపరాష్ట్రపతి సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.

స్పెషల్ స్టేటస్ అవసరం రాష్ట్రానికెంతోవుంది: నిఖిల్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించాల్సిన అవసవం ఎంతో వుందని టాలీవుడ్ యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా తాజాగా గొంతు కలిపాడు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానిమైన నిఖిల్.. ఈ హామీ ఎప్పుడు నెరవేరుతుందా..? అంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి అకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం కేంద్రంపై వుందన్నాడు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించిన నిఖిల్, 'నేను కేవలం నటుడ్నే. కొంత మంది ఇవన్నీ నీకెందుకు అంటున్నారు.

అయితే ఈ మధ్యనే తాను ఓ చిత్రం షూటింగ్ లో భాగంగా అంధ్రప్రదేశ్ ని పూర్తిగా చుట్టేసివచ్చామన్నాడు. ఏపీని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఏపీకి నిధులు కావాలి, అలా నిధులు కావాలన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా తాను రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TG Venkatesh  Parliament House  Telugu Desam Party  MPs  Union Budget  AP special status  Nitin  Actor  Politics  

Other Articles