Eggs hurled at Odisha CM Naveen Patnaik ముఖ్యమంత్రిపై మహిళ కోడిగుడ్ల దాడి..

Woman throws eggs at odisha cm naveen patnaik in balasore

Akash Das Nayak, Anant Das, Ashok Chandra Panda, BJD Rally, Egg attack on Naveen Patnaik, Egg thrown at Odisha CM, Eggs hurled at Odisha CM, Woman hurls eggs on Odisha CM

A woman, identified as the wife of a BJP worker, hurled eggs at Odisha chief minister Naveen Patnaik in Balasore.

ITEMVIDEOS: ముఖ్యమంత్రికి పరాభవం.. కోడిగుడ్లతో మహిళ దాడి..

Posted: 02/01/2018 09:03 AM IST
Woman throws eggs at odisha cm naveen patnaik in balasore

సాధారణ జీవనశైలితో సామాన్యులలో ఒకడిలా గడుపుతూ.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. ఏమాత్రం గర్వంలేకుండా నిరాడంబర జీవితాన్ని అస్వాదిస్తూ ప్రజల మన్ననలు పోందుతున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కు సొంత రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. దాదాపుగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన పాలనను అక్కడి ప్రజలు స్వాగతిస్త్తున్న క్రమంలో నిండు సభలో ఆయనకు చేధు అనుభవం ఎదురైంది.

నవీన్ పట్నాయక్ పై ఓ మహిళలో అగ్రహం కట్టలు తెంచుకుంది. నిండు సభలో ఆయనను అవమానించేందుకు అదే అమెకు ధైర్యాన్ని కూడగట్టింది. అంతే సీఎం అయినా పర్వాలేదనుకున్న అమె అతినిపై కోడిగుడ్లతో దాడికి పాల్పడింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అసలు అమె ఎవరు.? అమె ఈ దుస్సాహసానికి ఎందుకు పాల్పడింది.? అమెకు జరిగిన అన్యాయమేంటి.? అన్న వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.... ఒడిశాలోని బాలాసోర్‌ లో సీఎం నవీన్ పట్నాయక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతున్న సమయంలో సభికుల్లోంచి వేదిక వద్దకు వచ్చిన ఒక మహిళ ఆయనపై కోడిగుడ్లను విసిరేసింది. దీనిని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణగా నిల్చున్నారు. కాగా దాడికి పాల్పడిన మహిళ ఓ బీజేపి నేత భార్య అని ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అమె భర్తను పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా అమె ఈ దాడికి పాల్పడిందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naveen Patnaik  Eggs  Odisha chief minister  Balasore  Eggs thrown  odisha  

Other Articles