World witnesses rare super blue blood moon అకాశంలో అద్భుతం.. వీక్షించిన ప్రపంచం..

Rare cosmic show world witnesses rare super blue blood moon

Lunar Eclipse 2018 LIVE Streaming, Lunar Eclipse 2018 LIVE Streaming india, Lunar Eclipse 2018 LIVE, Lunar Eclipse 2018 LIVE how to watch, how to watch Lunar Eclipse 2018 LIVE, how to watch Super Blue Blood moon live, watch live Lunar Eclipse 2018

In a very rare event, the world will be witnessing a blue moon, a supermoon and a total lunar eclipse, all rolled into one on January 31.

ITEMVIDEOS: అకాశంలో అద్భుతం.. వీక్షించిన ప్రపంచం..

Posted: 01/31/2018 07:15 PM IST
Rare cosmic show world witnesses rare super blue blood moon

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రావోయి చందమామా అంటూ పిలిచే మనవాళ్లు ఇవాళ జాబిల్లిని చూసేందుకు ఎంతగానో వేచి చూశారు. జాబిల్లి కోసం అకాశమల్లే అన్నట్లుగా యావత్ ప్రపంచం వేచింది. ఖగోళంలో సుమారుగా 152 సంవత్సరాల తరువాత అవిష్కృతమైన అద్భుతాన్ని వీక్షించేందుకు అబాలగోపాలం వేచిచూసింది. పండు వెన్నెలను పంచే చంద్రుడు అత్యంత అరుదైన రూపంలో దర్శనమివ్వడాన్ని వీక్షించింది సంబరపడింది.

‘‘సూపర్‌ మూన్‌’’, ‘‘బ్లూ మూన్‌’’, ‘‘బ్లడ్‌ మూన్‌’’లను త్రిపాత్రాభినయం ఒకే రోజు అవిష్కృతం కావడం.. ఈ అవతారాలను ‘‘సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌’’గా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి అత్యంత అరుదైన దృశ్యం చివరిగా 1982లో చోటుచేసుకుంది. అయితే అప్పడు కొద్ది సేపు మాత్రమే ఈ పరిణామం వుండగా, ఈ సారి ఏకంగా 78 నిమిషాల నిడివిపాటు యావత్ ప్రపంచం కన్నులారా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. ఇలాంటి అరుదైన అవిష్కరణ మళ్లీ 2037 లో చోటుచేసుకుంటుంది.

భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని ‘‘సూపర్‌ మూన్‌’’గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు. మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘‘బ్లూ మూన్‌’’గా పిలుస్తారు. చంద్రగ్రహణం ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్‌ మూన్‌గా చెబుతారు. బ్లూ, బ్లడ్‌, సూపర్‌ మూన్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lunar eclipse  blood shed moon  NASA  science  space  technology  

Other Articles