jana sena for humanity politics says pawan kalyan జనసేనవి మానవత్వ రాజకీయాలు

Jana sena for humanity politics differs with vote bank politics says pawan kalyan

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Khammam, pawan kalyan warangal, pawan kalyan nalgonda, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan says his party jana sena differs with vote bank politics and supports humanity politics.

ITEMVIDEOS: మానవత్వంతో కూడిన రాజకీయాల కోసమే జనసేన

Posted: 01/24/2018 01:59 PM IST
Jana sena for humanity politics differs with vote bank politics says pawan kalyan

అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడానికి తాను పార్టీని స్థాపించలేదని, మానవత్వంతో కూడిన రాజకీయాలు చేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పాన పవన్.. భాద్యతతో, నిబద్దతతో  కూడిన రాజకీయాలు మాత్రమే తాను చేస్తాని చెప్పారు. రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే తన అకాంక్ష అని చెప్పారు.

ఇందుకోసమే తనకు ఉడుకు రక్తంతో కూడిన యువత సహకారం కావాలని చెప్పారు. యువతతో పాటు వారి తల్లిదండ్రుల అశీర్వాదాలు కూడా అవసమని, వారి అడపడచుల దీవెనలు కూడా కావాలని కోరారు. సమాజంలో మార్పు అంతత్వరగా రాదని అన్నారు. ఒక్క రోజులో విప్లవం సాద్యం కాదన్న పవన్ మార్పు సాధ్యమైయ్యేంత వరకు తాను కృషి చేస్తానన్నారు. అంబేద్కర్ అశయ సాధన కులవ్యవస్థ నిర్మూలన అని చెప్పుకోచ్చారు. కులాల మధ్య అంతరాలు తొలగిపోయిన రోజునే అది సాథ్యమన్నారు.

మహనీయులు అంబేద్కర్, నారాయణ గురు, జ్యోతిరావు పూలే, పిరియార్ ల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తనకు యువత సహకరించాలని అన్నారు. ఈ దిశగా జనసేన తీసుకువచ్చే అలోచనల నేపథ్యంలో యువత సహకారం, వారి తల్లిదండ్రుల ప్రోత్బలంతోనే మార్పు సాధ్యమవుతాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఏ కులం మరో కులానికి తక్కువ కాదని, ఒక కులానికి మరో కులానికి వున్న అవసరాలను తెలుసుకుంటే కులాల మధ్య వున్న అంతరాలు కూడా తొలగిపోతాయని అన్నారు. తనకు ఏ కులం, మతం, ప్రాంతీయతా లేవని అన్నారు. తాను భారతీయుడిని అని చెప్పుకోచ్చారు.

తన జనసేన పార్టీ ప్రజాసమస్యల పరిష్కారానికే ముందుగా ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తాను ఇటు తెలంగాణ, అటు అంధ్ర.. మరోవైపు కేంద్రం ప్రభుత్వాలకు విన్నవిస్తానని అన్నారు. ఈ క్రమంలో తనను విపక్షాలకు చెందిన పార్టీలు విమర్శించినా, దాడి చేసినా, తాను స్వీకరిస్తానని, సహిస్తానని అన్నారు. సమస్యల పరిష్కారం చేయాలంటూ అధికారమే కావాలన్నది లేదని అధికార పక్షాలకు విన్నవించి.. కూడా చేయించుకోవచ్చునని పవన్ కల్యాన్ అన్నారు.

తన చిత్రాలు శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం కూడా తనకు ఇష్టం వుండదని, అయితే అదే డబ్బును సమాజం కోసం వినియోగించాలన్నదే తన అలోచన అని అన్నారు. ఈ క్రమంలో తమ్ముడు చిత్రం సందర్భంతో నల్గోండ జిల్లాలోని ఓ గ్రామాన్ని శతజయంతోత్సవ వేడుకులకు అయ్యే ఖర్చుతో దత్తత తీసుకోవాలని తాను భావిస్తే.. స్థానిక రాజకీయ నాయకులు తనను అడ్డుకున్నారని.. ప్రజలకు మంచి చేయాలన్నా.. అడ్డుకుంటారా అన్న కారణం కూడా తనను రాజకీయాల దిశగా ప్రోత్సహించిందని అన్నారు.

ప్రముఖ నేతలు, మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం సముచితమని అయితే వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం కంటే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మరీ ముఖ్యంగా అంబేద్కర్, నారాయణ గురు, పూలే, పెరియార్ అలోచనా విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని కులసంఘాల నేతలతో చర్చలు జరిపి.. ఆయా కులాలు ముందుకు సాగలేకపోవడానికి కారణాలను తెలుసుకుంటామని ఈ క్రమంలో లొతైన అథ్యయనం కూడా చేస్తామని చెప్పారు పవన్. తన తుదిశ్వాస వరకు సామాజిక మార్పు తీసుకువచ్చాందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానని అన్నారు.

మతాల ప్రస్తావన లేని రాజకీయాలు ఎలా చేయాలన్నదానిపై కూడా తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇక ఈ మతాల ప్రస్తావన రాకుండా దేశంలోని ప్రతీ పౌరుడు జాతీయవాదంలో ముందుకు సాగాలని కూడా ఆయన పిలుపునిచచారు. భారతీయుత అన్న జాతీయతవాదం ముందు మతం చాలా చిన్నదని చెప్పారు. దీంతోనే దేశంలో మతాల మధ్య సామరస్యం ఏర్పడుతుందని అన్నారు. ఇక రాజకీయాలలో మాతల ప్రస్తావన వుండదని పవన్ చెప్పారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమ్యలు ఎలా వున్నాయి. వారికి వసతుల కల్పన ఎలా వుంది, బోజనం ఎలా వుందన్న వివరాలను తెలియజేయాలని పవన్ సూచించారు.

అవినీతి, అక్రమాలను సహించను

జనసేన అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. అక్రమాలు ఏ స్థాయిలో జరిగినా సహించదని అన్నారు. తన జనసేనలోకి వచ్చే వారు కూడా అలాగే వుండాలని చెప్పారు. అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయ ఏర్పాటు కోసం ఓ స్థలం కొన్నామని, అది కొంత ఇబ్బందిగా పరిణమించిందని.. అలా కాకుండా తనకు స్థలం కావాలంటే క్షణాల్లో ఏర్పాటు చేసే మిత్రులున్నారని, తన అత్మగౌరవాన్ని చంపుకుని తాను వారిని అడగదలచుకోలేదని అన్నారు. నా అత్మగౌరవం అవినీతి అక్రమాలను సహిందని పవన్ మరోమారు ఉద్ఘాటించారు.

కాంగ్రెస్ పార్టీ అంటే తనకు శత్రువు కాదని, అయితే రాష్ట్ర విభజనను సక్రమంగా చేయలేదని తనకు కోపం మాత్రం తనలో వుండేదని పవన్ కల్యాన్ అన్నారు.  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంటే తనకు గౌరవమని అన్నారు. అయితే కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తనతో వస్తే తెలంగాణలోని సమస్యలను వివరిస్తానని అన్న మాటలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాను వీహెచ్ తో కలసి తెలంగాణ సమస్యలను తెలుసుకునేందుకు సిద్దమని పవన్ చెప్పారు. తాను లెప్ట్ వింగ్, రైట్ విగ్ కాదని, తనది ప్రజల వింగ్ అని తాను ప్రజాఫక్షం వైపు నిలబడతానని, ప్రజల భావజావం వున్న వ్యక్తినని పవన్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  khammam  kothagudem  warangal  nalgonda  telangana  andhra pradesh  politics  

Other Articles