Kashmiri stupid boy dangerous train stunt సెల్పీ పైత్యం: ఎంఎంటీఎస్ రైలు ఢీకొని.. మరి కాశ్మీర్లో..

Selfie mad youth hits by fasting mmts train in bharath nagar

jammu youth stupidity, jammu youth train track video, Kashmiri boy dangerous train stunted, Viral Video, Selfie, Hyderabad, Death video, MMTS Train, Social Media Video, Video Viral, Moving Train Selfie

The incident happened in Bharat Nagar railway station in Hyderabad. A young man shiva brought Selfie with a fast-moving train. He is now being treated at hospital.

ITEMVIDEOS: సెల్ఫీ పైత్యం: ఎంఎంటీఎస్ రైలు ఢీకొని.. మరి కాశ్మీర్లో..

Posted: 01/24/2018 04:37 PM IST
Selfie mad youth hits by fasting mmts train in bharath nagar

నేటి తరం యువత ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీస ఇంకితజ్ఞానం కూడా కోల్పోయి సెల్పీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాశ్మీర్లో ఓ యువకుడు ఇలాంటి ప్రమాదకరమైన స్టంటును చేయగా, అలానే మరో స్టంటును చేయబోయిన హైదరాబాద్ యువకుడి ప్రాణాపాయస్థితిలో అస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు. ప్రాణాల మీదకు తీసుకువచ్చే సెల్పీలు వద్దని ఎందరు చెప్పినా.. జోష్ లో తాము ఏంచేస్తున్నామో కూడా అలోచించకుండా యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో శివ అనే యువ‌కుడు రైల్వే ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చి.. త‌న సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకోవాల‌ని అనుకున్నాడు. త‌న‌ వెన‌క నుంచి ఎంఎంటీఎస్ రైలు వ‌స్తుండ‌గా దాన్ని ఓ చేతితో చూపిస్తూ పోజులిచ్చాడు. ఆ ట్రైన్ అత‌డి కుడి చేతికి, త‌ల‌కి బ‌లంగా తాకింది. దీంతో యువకుడు పక్కకు ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయ‌ాలపాలైన యువకుడిని గుర్తించిన రైల్వే సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యులు చెప్పారు.

ఇదే తరహాలో కాశ్మీర్లో మరో యువకుడు ఏకంగా ప్రాణాంత‌క విన్యాసం చేశాడు. యువకుడు చేసిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డు చేశారో తెలియ‌దు కానీ, నిన్న సాయంత్రం ఇది సోష‌ల్ మీడియాలో ప్రత్య‌క్ష‌మైంది. కాశ్మీరీ సంప్ర‌దాయ కుర్తా ధ‌రించిన ఓ వ్య‌క్తి రైల్వే ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డుకోవ‌డం, త‌ర్వాత అత‌ని మీదుగా రైలు వెళ్ల‌డం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన‌వారంద‌రూ చాలా అస‌హ‌నానికి గురై జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లాకు ఫిర్యాదు చేశారు.

ఈ వీడియోపై ఆయ‌న స్పందిస్తూ... 'సాహ‌సాలు చేయ‌డం కోసం మ‌రీ ఈ స్థాయికి దిగ‌జార‌డం నిజంగా మూర్ఖ‌త్వం' అని అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారి అంద‌రూ అనుక‌రించ‌క ముందే ఆ వీడియోలో ఉన్న వ్య‌క్తిపై, తీసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు నెటిజ‌న్లు ఒమ‌ర్ అబ్దుల్లాను కోరారు. అయితే రైల్వే ట్రాకులపై ఇలాంటి వీడియోలు తీసుకున్నందుకు కాశ్మీర్ రైల్వే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. యువకుడి అచూకీ కోసం వెతుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles