international flight to connect dubai and gannavaram గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమానం..

Air india express to launch flight connecting dubai to vijaywada

Air India Express, international flight, Dubai, saudi to gannavaram, Vijaywada. Gannavaram Airport, Ashokgajapathi raju, latest news, andhra pradesh politics

Air India Express is going to introduce a flight connecting Dubai with Vijaywada. This will be the first flight of the airline as it going to launch its services from Vijaywada’s fast expanding Gannavaram Airport.

గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమానం.. ఎక్కడికో తెలుసా.?

Posted: 01/18/2018 04:58 PM IST
Air india express to launch flight connecting dubai to vijaywada

రాజధాని లేని రాష్ట్రంగా సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం నిలిచిన నవ్యాంద్రప్రదేశ్ అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏకంగా సచివాలయం, అసెంబ్లీలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్న రాష్ట్రం.. ఇక అమరావతికి అత్యంత చేరువలోని గన్నవరం విమానాశ్రయం అభివృద్దిపై కూడా దృష్టిసారించింది. గన్నవరం నుంచి దేశీయ విమానసర్వీసులు మాత్రమే వుండగా ఇక అంతర్జాతీయ సర్వీసులకు కూడా శుక్రవారం నుంచి అతిథ్యమివ్వనుంది.

అమరావతి వాసుల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. ఇక్కడి నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు రేపు ప్రారంభం కానుంది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ద్వారా ఈ సర్వీసు ప్రారంభం కానుంది. విజయవాడ టు దుబాయ్ వయా ముంబై గా ఈ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ తొలి సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గన్నవరం విమానాశ్రయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

దుబాయ్, సౌదీలకు ఈ విమానం నడుస్తుంది. విజయవాడలో ఇప్పటికే ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ విమానం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9.45కు విజయవాడకు వచ్చి, ఆపై ఉదయం 10.30కి బయలుదేరి ముంబై మీదుగా దుబాయ్, సౌదీలకు వెళుతుంది. ముంబైకి అక్కడి నుంచి యూఏఈకి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ విమానానికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

కాగా, గన్నవరం విమానాశ్రయంలో మొత్తంగా పది కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ఐదు కౌంటర్లు అరైవల్ కోసం వినియోగిస్తుండగా, మరో ఐదింటిని మాత్రం డిపార్చర్ కోసం వినియోగించనున్నారు. ప్రైవేటు విమాన సంస్థలు ఇంటర్నేషనల్ సర్వీసులను విజయవాడ నుంచి ప్రారంభించేందుకు సాహసం చేయలేకపోతున్న వేళ, ఎయిర్ ఇండియా ముందుకు రావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles