Modi conspiring against me alleges Togadia నాకు వ్యతిరేకంగా ప్రధాని కుట్రలు: ప్రవీణ్ తొగాడియా

Pravin togadia alleges pm modi conspiring with police to harass him

Pravin Togadia, Pravin Togadia VHP, VHP Pravin Togadia, Vishwa Hindu Parishad, PM Modi Togadia, PM Modi Pravin Togadia, Rightwing Pravin Togadia, Pravin Togadia Ahmedabad disappearance, Police, latest news

Ahmedabad Crime Branch joint commissioner J K Bhatt is hatching conspiracy against me and harassing VHP workers on direction of his political bosses sitting in Delhi,” said Togadia after being discharged from a private hospital.

ప్రధాని మోడీపై ప్రవీణ్ తొగాడియా సంచలన అరోపణలు

Posted: 01/18/2018 04:03 PM IST
Pravin togadia alleges pm modi conspiring with police to harass him

విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని, తన గొంతును మౌనంగా వుంచేందుకు ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారని అరోపించారు. ఇందులో భాగంగా ప్రధాని ఏకంగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ జేకే భట్ ను కూడా పావుగా వాడుకుంటున్నారని అరోపణలు చేశారు.

తన అరోఫణలు నిజమని తాను భావిస్తున్నానని, కాదని బీజేపి నేతలు వాదించిన పక్షంలో గత కొన్ని రోజులుగా మోదీకి, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ జేకే భట్ కు మధ్య జరిగిన కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్ రికార్డులు బయటకు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

తొగాడియా వ్యవహారంలో వీహెచ్పీ నేతలు కూడా లోతుగా పరిశీలన జరపాల్సిన అవసముందన్న వాదనను వినిపిస్తున్నారు. కొందరు వీహెచ్పీ నేతలు ఈ వివాదాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నెల అలహాబాద్ లో మార్గదర్శక్ మండల్, సంత్ ల సమావేశం జరుగనుండటంతో ఆక్కడ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిచాలని తొగాడియా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అసలు ఏం జరిగిందంటే..

కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా క్రితం ప్రభుత్వాల మాదిరిగానే పాలన సాగుతుందని తొగాడియా విమర్శలు చేశారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆయన మోదీకి వ్యతిరేకంగానే గళాన్ని విప్పారని తెలుస్తుంది. ఈ విషయాలను పక్కడబెడితే తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకొర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులు మీడియా ఎదుటకు వచ్చి ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీజేపి సదరు అంశంలో జోక్యం చేసుకోవద్దని, పార్టీ నేతలు కూడా ఈ విషయంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. కాగా కేంద్రం కూడా సమస్యను భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకే వదిలేసింది. వారే ఈ సమస్యను పరిష్కరించుకుంటారని వాదించింది. అయితే తొగాడియా మాత్రం కేంద్రం సహా బిజేపి నేతలపై విమర్శలు గుప్పించారు. ఇవే వ్యాఖ్యలు ఎవరైనా చేసివుంటే వారు దేశద్రోహులని లేక కాంగ్రెస్ ఏజెంట్లు అని ముద్రవేసే బీజేపి నేతలు వారిపై మాత్రం ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. దీంతో ఆయనను బీజేపి టార్గెట్ చేసినట్లు తొగాడియా స్వతహాగా ప్రకటించుకున్నారు.

నిగ్గదీసి అడిగిన మిత్రపక్షం శివసేన

తనను అంతం చేయాలన్న కుట్రలు సాగుతున్నాయన్న ప్రవీణ్ తొగాడియా అరోపణలపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. అదికార పత్రిక సామ్నా ద్వారా ఈ విషయంలో నిజం నిగ్గుతేలాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే బీజేపిలోని కురువృద్ద నేత అద్వాని గొంతును నొక్కిన ప్రధాని.. ప్రవీణ్ తొగాడియా గొంతును కూడా నొక్కేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించింది. హిందూ భావజాలం వున్న నేతలకే బీజేపి అధికారంలో రక్షణ కరువైతే మోడీ ప్రభుత్వం ఎవరికి రక్షణగా నిలుస్తుందని ప్రశ్నలను సంధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pravin Togadia  VHP  Vishwa Hindu Parishad  PM Modi  Ahmedabad Police  latest news  

Other Articles