CJI Dipak Misra meets dissenting judges పరిష్కారం దిశగా.. ఆ నలుగురితో సీజేఐ భేటీ..

Cji dipak misra meets four senior most supreme court judges

Supreme court judges, justice dipak misra, sc judges meet CJI, chief justice of indian, supreme court crisis, Supreme court, judges, chief justice, dipak misra, supreme court crisis, legal news

Four judges including Justices J Chelameswar, Ranjan Gogoi, Madan B Lokur and Kurian Joseph met the CJI and the meeting lasted for around 10-15 minutes.

పరిష్కారం దిశగా.. ఆ నలుగురితో సీజేఐ భేటీ..

Posted: 01/18/2018 03:18 PM IST
Cji dipak misra meets four senior most supreme court judges

సుప్రీంకోర్టు పరిపాలన సజావుగా లేకపోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి చేరిందంటూ బహిరంగంగా ప్రకటించిన నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తో భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా జస్టిస్ దీపక్ మిశ్రా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

తన తరువాతి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో వున్న సీనియర్ న్యాయమూర్తులు ఇలా తిరిుగుబాటు ప్రకటనలు చేయడానికి కారణమైన అంశాలపై ఆయన వారితో చర్చించారు. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈ భేటీలో ప్రాధన్యతనిచ్చినట్లు సమాచారం. ఉదయం కోర్టు వ్యవహారాలు ప్రారంభమయ్యే సమయం 10.30 గంటలకు ముందే ఈ భేటీ జరిగింది.

సుమారుగా 15 నిమిషాల పాటు సీజే దీపక్ మిశ్రా నలుగురు న్యాయమూర్తులతో చర్చించారు. కాగా, సమావేశం ఫలితాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 12న జస్టిస్ జే చలమేశ్వర్ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అందోళన వ్యక్తం చేస్తూ దేశం, భరతజాతి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  judges  chief justice  dipak misra  supreme court crisis  legal news  

Other Articles