Pregnant Woman Dies During Treatment, Family Demands Probe 22 రోజుల వైద్యం.. రూ.18లక్షల బిల్లు.. రోగి మృతి

Pregnant woman dies at asian hospital charges rs 18 lakh

woman, negligence, familymembers, rs18lakh, pregnant woman, faridabad, Asian Hospital, corperate Hospital, government, stern action,

woman at Faridabad's Asian Hospital has died allegedly due to complications after giving birth to a stillborn. Her relatives alleged medical negligence and are demanding an investigation into the matter.

కార్పోరేట్ అసుపత్రి ఆగడం.. 22 రోజుల వైద్యం.. రూ.18లక్షల బిల్లు.. రోగి మృతి

Posted: 01/11/2018 02:28 PM IST
Pregnant woman dies at asian hospital charges rs 18 lakh

కార్పొరేట్‌ ఆసుపత్రుల అగడాలు రోజుకోక్కటి వెలుగులోకి వస్తున్నా.. వారిలో మాత్రం కనీసం మార్పు రావడం లేదు. ప్రజాధనంతో వైద్యవిద్యను అభ్యసించామన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులను నారాయణలుగా పొల్చుతూ.. దేవుళ్లుగా పరిగణిస్తూ.. రోగులు, వారి బంధువులు వ్యవహరిస్తుంటే.. వారు మాత్రం తాము నారాయణులమని, తమకంతా ధనంతోనే కానీ మనుషులతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఓ గర్భిణి పట్లు కార్పోరేట్ అసుపత్రి వ్వవహరించిన ఘటన బట్టబయలైంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఓ గర్భవతికి 22 రోజుల పాటు చికిత్స చేసినందుకు గాను ఏకంగా రూ.18లక్షల బిల్లు వేసి తమ ధనదాహాన్ని తీర్చుకుంది ఓ కార్పోరేట్ అసుపత్రి. హర్యాణాలోని ఫరీదాబాద్ ఏషియన్ అసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రోగి బంధువులు ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకెళ్తే.. హర్యాణలోని ఫరిదాబాద్ లోని ఏషియన్‌ ఆసుపత్రిలో జర్వంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ చేర్పింది. ‘టైఫాయిడ్‌ వచ్చిందని చెప్పి వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూలో పెట్టారు. అనంతరం ఆమెకు గర్భస్రావం అయిందని, వెంటనే ఆపరేషన్‌ చేసి పిండాన్ని బయటకు తీయాలని చెప్పి రూ.3లక్షలు కట్టమన్నారు. 22 రోజుల పాటు ఆమెకు చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇక చివరకు రూ. 18 లక్షల బిల్లును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లలాని అసుపత్రి వర్గాలు అదేశించాయి.

దీంతో ఖంగుతిన్న రోగి బంధువులు.. ఆపరేషన్‌కు ముందే రూ.12లక్షల చెల్లించామని, అయినా తమ వారి ప్రాణాలు దక్కలేదని అరోపించిన బంధువులు ఇప్పుడు ఏకంగా మరో అరు లక్షల రూపాయలను చెల్లించి రోగి మృతదేహాన్ని తీసుకెళ్లాలని అస్పత్రి వర్గాలు చెబుతున్నాయని రోగి తరపు బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ యాజమాన్యం తీరుపై విచారణ చేపట్టాలని, 22 రోజులకు రూ.18లక్షల బిల్లు ఎలా వేస్తారంటూ ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు.

Haryana: A pregnant woman, suffering from fever, died at Faridabad's Asian Hospital. Hospital administration handed over bill of Rs 18 Lakh to her family for a 22-days treatment. Relatives demand an investigation against hospital administration. (08.01.2018) pic.twitter.com/hKY1yLgUSj

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  negligence  familymembers  rs18lakh  pregnant woman  faridabad  Asian Hospital  

Other Articles