3 Jawans Fall From a Chopper During Army Day Practice హెలికాప్టర్ నుంచి జారిపడ్డ జవాను..

3 jawans fall from a chopper during army day practice

indian army, indian army accident, chopper accident, helicopter accident, soldiers helicopter accident, army day, new delhi, indian army jawans rehearsal, army jawans helicopter accident, national news

Three jawans of the Indian Army fell off a chopper after the rope slipped off during slithering operations being conducted as part of the rehearsal for Army Day on January 15.

ITEMVIDEOS: హెలికాప్టర్ నుంచి జారిపడ్డ జవాను..

Posted: 01/11/2018 06:25 PM IST
3 jawans fall from a chopper during army day practice

జనవరి 15న నిర్వహించే ఇండియన్ అర్మీ డే సందర్భంగా జరుగుతున్న రిహార్సెల్ లో అపశృతి చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ నుంచి వరుస క్రమంలో దిగి అర్మీ జవాన్లు తమ చేతుల్లోని ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడికి సిద్దంగా వుండాల్సిన ఫీటును చేస్తుండగా ప్రమాదవశాత్తూ ముగ్గురు జవాన్లు హెలికాప్టర్ నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయాలపాలయ్యారు.

ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఆర్మీ హెలికాప్టర్లలో వచ్చిన జవాన్లు పరేడ్‌ డ్రిల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న క్రమంలో.. పరేడ్‌ మైదానం వద్ద హెలికాప్టర్‌ నుంచి తాడుతో దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఒక్కొక్కరుగా వరుస క్రమంలో దిగుతుండగా ఆ బరువుకు తాడు తెగిపోయింది. నాలుగో జవాను దిగడానికి సిద్ధమవుతుండగా తాడు తెగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో కిందపడిపోయిన జవాను తాడు సాయంతో దిగుతున్న జవాన్లపైపడి కిందపడిపోయాడు.

దీంతో నాలుగో జవానుతో పాటు కిందకు దిగుతున్న ఇద్దరు జవాన్లపైబడుతూ కొన్ని అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు, ఈ ఘటనలో కిందకు దిగి నిలబడిన మరో జవాను కూడా గాయాలపాలయ్యారు. ఈ వీడియోలను అక్కడే వుండి చిత్రీకరిస్తున్న కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై దర్యాప్తు చేయించాల్సిందిగా ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army Day  accident  Army Day rehearsal  General KM kariappa  Indian Army  Jawans  

Other Articles