woman alleges traffic police of misbehave ఎవడ్రా ఛలానా వేసేదీ అంటూ మహిళ వీరంగం..

Lucknow woman alleges traffic police of misbehave

woman, misbehave, toeing woman's car, car parking, no parking, lucknow, traffic police, uttar pradesh, viral video, video viral, crime

Woman alleges traffic police of misbehave in Lucknow. Traffic police was trying to toe woman's car which was parked illegally at no parking area.

ITEMVIDEOS: ఎవడ్రా ఛలానా వేసేదీ అంటూ మహిళ వీరంగం..

Posted: 01/11/2018 01:51 PM IST
Lucknow woman alleges traffic police of misbehave

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఓ మ‌హిళ వీరంగం సృష్టించింది. నో పార్కింగ్ ఏరియాలో కారును పార్క్ చేయడమే కాకుండా.. కారు వద్దకు చేరకున్న ట్రాఫిక్ పోలీసులను నెట్టిసి మరీ తన కారును తీసుకుని దర్జాగా వెళ్లింది. మహిళ తమతో అనుచితంగా వ్యవహరించి మరీ తన కారును నో పార్కింగ్ ఏరియా నుంచి తీసుకెళ్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన పోలీసులకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.

వివరాల్లోకి వెళ్తే లక్నోలోని ఓ మ‌హిళ తన కుటుంబసభ్యుడితో షాపింగ్ కు వచ్చింది. ఈ సమయంలో నో పార్కింగ్ ప్రాంతంలో కారును పార్క్ చేసి వెళ్లింది. తన పని ముగించుకుని తిరిగి తన కారు వద్దకు వచ్చే సరికి అమె కారు వద్ద ట్రాఫిక్ పోలీసులు నిలబడి వున్నారు. అమె కారును ట్రాఫిక్ వ్యాన్ కు కట్టి స్థానికంగా వున్న ట్రాపిక్ పోలిస్ స్టేషన్ కు తరలించాలని ప్రయత్నిస్తున్నారు.

దానిని గమనించిన మహిళ శివాలెత్తిపోయింది. తాను కారు పార్క్ చేసిన సమయంలో అక్కడ ట్రాపిక్ లేదని వాదించింది. అయినా పోలీసులు అమె కారును తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, కారుకి అడ్డంగా నిల‌బ‌డ్డ ట్రాఫిక్ పోలీసుని తోసేసి మ‌రీ త‌న వెంట ఉన్న ఓ వ్య‌క్తి సాయంతో ఆ కారుని తీసుకెళ్లింది. పోలీసులపై దుర్భాషలాండింది. ఈ ఘ‌ట‌న అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  misbehave  no parking  lucknow  traffic police  uttar pradesh  viral video  crime  

Other Articles