MLA slaps female cop, gets it back అలా చేసిన ఎమ్మెల్యే చెంప కూడా చెల్లుమంది..

Congress mla slaps woman constable in shimla gets it back

asha kumari, asha kumari assaults woman constable, asha kumari slapped back, rahul gandhi himachal review meet, asha kumari slapped back in shimla, congress mla assaults woman constable

Congress MLA Asha Kumari on Friday slapped an on-duty woman constable with the latter hitting her back. Kumari was allegedly being stopped by the police from entering party president Rahul Gandhi’s review meeting in Shimla.

ITEMVIDEOS: రాహుల్ మీటింగ్లో రసాభాస.. ఎమ్మెల్యే చెంప కూడా చెల్లుమంది..

Posted: 12/29/2017 04:08 PM IST
Congress mla slaps woman constable in shimla gets it back

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశ ప్రాంగణంలో గందరగోళం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో పాల్గొనేందుకు హిమాచల్ కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశాకుమారికి తీవ్ర అవమానం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్‌ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బతిన్నారు.

సమీక్ష సమావేశానికి తనను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అయిన తనను పోలీస్‌ సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో అమె ఆగ్రహానికి గురైయ్యారు. పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. వెనువెంటనే ఆమె ఎవరన్న విషయం కూడా తెలియని మహిళా కానిస్టేబుల్ కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించింది.

ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. అధికారులు కలగజేసుకోవడంతో… పరిస్థితి సద్దుమణిగింది. అయితే తరువాత తన తప్పును తెలుసుకన్న ఎమ్మెల్యే మహిళా కానిస్టేబుల్ తల్లి వయస్సున్న తనను పరాభావానికి గురిచేయడంపై అమె అగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను కూడా సంయమనంతో వ్యవహరించి వుండాల్సిందని, తాను సహానాన్ని కొల్పోవలసింది కాదని అశాకుమారీ క్షమాపణలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles