Airtel announces Rs 93 plan జియోకు షాకిస్తూ ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

Airtel rs 93 recharge to take on jio s rs 98 offer

airtel, airtel recharge, airtel recharge offer, airtel rs 93 plan, airtel prepaid recharge, airtel 1gb data plan, reliance jio, latest news

Apart from 1GB 3G/4G data, Airtel users will get unlimited local, STD and roaming calls along with 100 SMS per day for 10 days.

రిలయన్స్ జియోకు షాకిస్తూ ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

Posted: 12/29/2017 03:21 PM IST
Airtel rs 93 recharge to take on jio s rs 98 offer

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ మరో కొత్త ప్లాన్ తో కస్టమర్లను అకర్షించేందుకు రంగంలోకి దిగింది. టెలికాం రంగంలో నూతనంగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోని విప్లవాత్మకమైన సంచలనాలకు తెరలేపిన నేపథ్యంలో దానిని ఢీ కొట్టేందుకు.. టెలికాం దిగ్గజాలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా వొడాఫోన్, ఎయిర్ టెల్ లాంటి టెలికాం సంస్థలు జియో ఆఫర్ల కన్నా తక్కువ ధరలో తమ వినియోగదారుల కోసం ఆఫర్లను గుప్పిస్తున్నాయి.

ఇందులో భాగంగా రిలయన్స్ జియో రూ. 98 ప్లాన్ కి గట్టి పోటీని విసురుతూ ఎయిర్ టెల్ రూ. 93తో ఓ కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.93 రీచార్జి చేసుకుంటే వారికి 1GB 3G/4G డేటా ఫ్రీగా లభిస్తుంది. రోజుకు 100 SMS లు పంపుకోవచ్చు. అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత రోమింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 10 రోజులుగా నిర్ణయించారు. దీంతో పాటు మరో ప్లాన్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది

ఎయిర్ టెల్. రూ.59తో రీఛార్జ్ చేసుకుంటే వారికి 500MB 3G/4G డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 SMS లు పంపుకోవచ్చు. అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత రోమింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు. కాగా ఇప్పటికే జియో రూ.98 ప్లాన్‌లో యూజర్లకు 2.1 GB డేటా ను అందిస్తోంది. దీన్ని రోజూ 0.15 GB చొప్పున వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్ వస్తాయి. 140 SMS లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles