Husband Murders Wife Doubting Her Character అందమైన భార్య జీవితంలోకి వస్తే.. ఇలా చేస్తారా.?

Husband murders wife alleging her beauty and doubting her character

nagaraju, netravati, beautiful, mobile phone, bellary, kombali government school, murdered, hanging, heart attack, karnataka, crime, latest news

A government school teacher of kombali naga raju murdered his wife netravati alleging her beauty and doubting her character and tried to created it as heart attack.

అందమైన భార్యపై అనుమానంతో..

Posted: 12/23/2017 05:56 PM IST
Husband murders wife alleging her beauty and doubting her character

అందమైన భార్య జీవితంలోకి వస్తే.. ఆ ముఖంలో చిరునవ్వును చూడాలని భావిస్తారు భర్తలు. అందుకోసం అహర్నిషలు కష్టపడైనా వారిని సుఖసంతోషాలలో ఉంచాలని భావిస్తారు. ఈ మాస్టారు మాత్రం అందుకు భిన్నం. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయుడిగా ఉద్యోగం. అంతమైన భార్య ఇక జీవింతమంతా హాయే అని భావించాల్సిన మాస్టారు మైండ్ లోకి అనుమానపు భూతం దూరింది.

అందమైన భార్య తన జీవిత భాగస్వామిగా రావడం అదృష్టంగా భావించాల్సిందిపోయి అనుమానంతో అమెను మట్టుబెట్టాడు. కళ్యాణం జరిగి ఏడాది కాకమునుపే... భర్త చేతిలో ఆ యువతి తన ప్రాణాలను కొల్పోయింది. అయితే తన భార్య అందంగా వుందని.. అమె ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతోనే అమెను హతమార్చాడు. ఈ ఘలన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మొబైల్‌ ఇస్తే ఇతర వ్యక్తులతో మాట్లాడుతుందనే అనుమానం వెంటాడి పెనుభూతంగా మారింది. ఈ క్రమంలో అతను ఏం చేస్తున్నాడన్న విఛక్షణ కూడా కోల్పోయిన భర్త అమెను చంపేశాడు. ఆ తరువాత దానిని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. బళ్లారి జిల్లా పరిధిలోని హూవినహడగలి తాలూకా కొంబళి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు భార్య నేత్రావతిని ఉరివేసి చంపాడు.

అనంతరం దానిని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. ఏడాది క్రితం నాగరాజుకు చెన్నగిరి తాలూకా పరిధిలోని హెబ్బాళగేరికి చెందిన నేత్రావతితో వివాహమైంది. వివాహం అయిన నాటి నుంచి భార్య నేత్రావతిని అనుమానిస్తూ హింసిస్తుండేవాడు. భార్యను పుట్టింటికి పంపకుండా అమె తలిదండ్రులతో మొబైల్ లో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేదించే వాడని నాగరాజుపై ఆరోపణలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagaraju  netravati  mobile phone  bellary  government school  murder  karnataka  crime  latest news  

Other Articles