Army crosses LoC, kills 3 Pak soldiers జైష్ ఉగ్రవాదులపై భారత అర్మీ ప్రతీకారం

Indian army crosses loc kills 3 pakistani soldiers

Surgical strikes, Pakistan occupied kashmir (PoK), Line of Control (LoC), Jaish e mohammad, terrorist group, Jammu and Kashmir, Indian Army, Rajouri attack, retaliation, ceasefire violations, border tensions

Indian Army jawans crossed the Line of Control (LoC) and killed three Pakistan Army soldiers, in retaliation to four Indian Army jawans being killed in Keri sector of Jammu and Kashmir's Rajouri district.

సరిహద్దు దాటి.. జైష్ ఉగ్రవాదులపై భారత అర్మీ ప్రతీకారం

Posted: 12/26/2017 09:50 AM IST
Indian army crosses loc kills 3 pakistani soldiers

భారత అర్మీ పాకిస్థాన్ తీవ్రవాదులపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. నలుగురు భారత అర్మీకి చెందిన జవాన్లను దొంగదెబ్బ తీసి హతమార్చిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునే దిశగా కదిలిన భారత రక్షణ బలగాలు ఓ అడుగు ముందుకేసీ మరీ పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోకి చోచ్చుకెళ్లి మరి మతమార్చాయి. దీంతో భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.

భారత అర్మీపై దొంగచాటుగా కాల్పులకు తెగబడుతున్న జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఎల్వోసీని దాటి వెళ్లి మరీ భారత ఆర్మీ హతమార్చింది. గత శనివారం పాకిస్తాన్- భారత నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ వద్ద గస్తీ కాస్తున్న భారత అర్మీకి చెందిన నలుగురు సైనికులపై జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్‌ అధికారి ఒకరు చెప్పారు.

భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. భారత అర్మీ ధీటుగా సమాధానం ఇవ్వడంతో.. ఈ కాల్పుల్లో జైషే ఈ మహ్మద్‌ టాప్‌ కమాండర్ నూర్ మహ్మద్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ పై పాకిస్తాన్‌ మీడియా మాత్రం వక్రబాష్యంగానే కథనాలను ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles