Relief for Ashok Chavan as Bombay High Court రాహుల్ శకం కాంగ్రెస్ కు శుభసూచకమేనా..?

Relief for ashok chavan as bombay high court rejects governor s prosecution order in adarsh scam

Ashok Chavan, Bombay High Court, Governor, Vidyasagar Rao, Adarsh housing society, adarsh scam, Rahul Gandhi, Congress President, 2g scam, Maharashtra, india news, social news, latest news

Chavan was also charged with illegally approving, as the then Revenue Minister, allotment of 40 per cent of the flats to civilians in the high-rise in posh Colaba.

రాహుల్ శకం శుభసూచకమేనా.. అదర్శ్ స్కాంలో చవాన్ కు ఊరట

Posted: 12/22/2017 01:40 PM IST
Relief for ashok chavan as bombay high court rejects governor s prosecution order in adarsh scam

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన వేళ విశేషమేమిటో గాని కాంగ్రెస్ పార్టీకి గతంలో అశనిపాతంలా వున్న వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం శుభసంకేతాలను ఇస్తున్నాయి. అధ్యక్ష పగ్గాలను అందుకున్న వెంటనే వచ్చిన గుజరాత్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కొద్దిలో అధికారన్ని దూరమయ్యింది. ఇప్పటికే 80 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ మరో 15 స్థానాల్లో కేవలం వెయ్యి లోపు ఓట్లతోనే ఓటమిని చవిచూసి అధికారానికి దూరమైంది.

ఇక అ వెనువెంటనే యూపీఏ ప్రభుత్వ పరువును మసకబారేట్లు చేసిన 2జీ కుంభకోణం కేసులో కూడా నిందితులందర్నీ నిర్దోషులనే న్యాయస్థానం పరిగణించి.. ఈ కేసులో సాక్షాలను, అధారాలను పొందుపర్చడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కూడా తీర్పును చెప్పింది. ఈ క్రమంలో ఇక మహారాష్ట్ర నేతలకు కూడా ఊరట లభించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయరాదని అదేశాలను జారీ చేసింది.

ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ సాధన జాదవ్ డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. చవాన్‌కు వ్యతిరేకంగా తాజా సాక్ష్యం ఉన్నట్లు గవర్నర్ ఈ అనుమతిని మంజూరు చేయడానికి ముందు సీబీఐ పేర్కొందని, అయితే తాజా సాక్ష్యాన్ని సమర్పించడంలో సీబీఐ విఫలమైందని హైకోర్టు తెలిపింది. గవర్నర్ కు సీబీఐ సమర్పించిన పత్రాలను విశ్వసనీయ తాజా సాక్ష్యంగా పరిగణించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
 
అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ విద్యా సాగర్ రావు 2016 ఫిబ్రవరిలో అనుమతివ్వడంతో.. అశోక్ చవాన్ హైకోర్టును ఆశ్రయించారు. అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను చవాన్ ఆమోదించారని, ఆయన తన బంధువుల నుంచి రెండు ఫ్లాట్లను తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. 2008 డిసెంబరు నుంచి 2010 నవంబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆయన.. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వైదొలగిగారు. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Chavan  Bombay High Court  governor  Maharashtra  Rahul Gandi  Congress  Adarsh scam  

Other Articles