State of anarchy in Karnataka, alleges Yogi Adityanath భక్తుడిగా భేష్.. సీఎంగా వేస్ట్: యోగీ పై సీఎం ఫైర్

Frdi bill long queues in banks for withdrawing money panic among people

Karnataka Assembly Elections 2018, Karnataka Assembly polls, lord hanuman, Narendra Modi, Siddaramaiah, Tipu Sultan, Yogi Adityanath, Karnataka news, india news, social news, latest news

Hitting back at UP CM Yogi Adityanath, Karnataka CM Siddaramaiah questioned, Has the BJP taken ownership of Hindus? We are also Hindus. But we respect all religions unlike the BJP. We treat all of them equally. This is our culture. This is real Hindutva”.

భక్తుడిగా భేష్.. సీఎంగా వేస్ట్: యోగీ పై సీఎం ఫైర్

Posted: 12/22/2017 11:25 AM IST
Frdi bill long queues in banks for withdrawing money panic among people

ఉత్తరాధి రాష్ట్రాలలో తమ అధిపత్యాన్ని చాటుకున్న తరువాత ఏకంగా దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో నమోదైన రికార్డును కూడా కొల్లగొట్టి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపి.. ఇక దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తమ చేతి నుంచి జారీపోయిన కర్ణాటకపై ముందుగా గురిపెట్టింది. ఈ రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుని ఆ తరువాత మిగతా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని భావిస్తుంది.

ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ను రంగంలోకి దింపగా, ఆయన వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు, ఆయనకు పోటీగా టిప్పు సుల్తాన్ బరిలోకి దిగుతున్నారని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అధ్యక్షతన జరిగిన పరివర్తన ర్యాలీని యోగి ప్రారంభించిన అనంతరం టిప్పు సుల్తాన్ శతజయంతోత్సవాలను ఘనంగా నిర్వహించిన పాలక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, ఆయనను పూజించడం మానేసిన కాంగ్రెస్.. దైవారాధనను మాని మానవమాత్రుడైన టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ ను స్వాతంత్ర్య సమర యోధుడిగా చెబుతున్న కాంగ్రెస్ ను హనుమంతుడు ఓడిస్తాడని చెప్పారు. ఓ వైపు బీజేపీ కార్యకర్తల హత్యలు జరుగుతుంటే... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు.  

కాగా యోగీ అదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని అధికారంలోకి రావాలని చూసే పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో గుజారాత్ అభివృద్దిని చూపిన బీజేపి.. ఇక్కడ అభివృద్దిని చూసి కంటగింప్పుగా మారి.. ఇక చేసేది లేక హిందుత్వవాదాన్ని తమ భుజాలపై వేసుకుని సంచలన వ్యాక్యలు చేయడం సమంజసం కాదని చెప్పారు. తన పేరులోనూ సిద్ద, రామ అన్ని పేర్లు వున్నాయని గుర్తుచేశారు.

బీజేపి పార్టీలో హిందువులకు యాజమాన్య హక్కులను తీసుకుందా..? ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపుకు ముస్లిం మహిళల ఓట్లే కారణమని చెప్పుకున్న బీజేపి కర్ణాటకకు వచ్చేసరికి తన వైఖరిని మార్చిందని గుర్తుచేశారు. బీజేపిలో కేవలం హిందువులే వున్నారా..? అని ప్రశ్నించారు. తాను హిందువునేనని చెప్పిన సిద్దరామయ్య.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అన్ని మతాలలోనూ సోదరభావంతో మెలుగుతానని చెప్పారు. ఇదే అసలైన హిందుత్వమని చెప్పుకొచ్చారు. ఇక తాను యోగీ అధిత్యనాథ్ కంటే ఉన్నత్తమైన, ఉత్తమమైన హిందువునని చెప్పుకోచ్చిన ఆయన భక్తుడిగా యోగా బెష్ అని.. అయితే సీఎంగా రాష్ట్ర ప్రజలకు సేవలందించడంలో మాత్రం విఫలమయ్యారని విమర్శలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles