AP home minister permits cockfight on sankranti కోడి పందేలకు ప్రభుత్వం పచ్చజెండా..

Ap home minister nimmakayala chinarajappa permits cockfight on sankranti

andhra pradesh permits cockfight, ap goverment permits cockfight, sankranti cockfight, home minister, nimmakayala chinarajappa, AP goverment, cockfight, sankranti, white paper, polavaram project, gorantla buchaiah chowdary, TDP, andhra pradesh, india news, social news, latest news

andhra pradesh home minister nimmakayala chinarajappa says goverment issues permission for cockfight on sankranti. He also says government is ready to issue whit paper on polavaram project.

కోడి పందేలకు ప్రభుత్వం పచ్చజెండా.. శ్వేతపత్ర డిమాండ్ కు సై..

Posted: 12/22/2017 02:19 PM IST
Ap home minister nimmakayala chinarajappa permits cockfight on sankranti

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాలో కోడి పుంజులు రెక్కడు విధిల్చి సై.. సైరా అంటాయి. అందుకు అనాధిగా ఇక్కడ వస్తు్న అచారమే కారణం. కొన్నేళ్లుగా కోడి పందేలకు అనుమతి లేదంటూ అంక్షల నడుమ దొంగచాటుగా జరుగుతున్న కోడి పెందేలకు ఇక అలాంటి పరిస్థితి పోయింది. కోడి పందేలా విషయంలో తెలుగువారిలో కొట్టోచ్చినట్టు కనిపించిన ఐక్యత, సంస్కృతి, సంప్రదాయం తెచ్చిన యూనిటీ, ప్రత్యేక హోదా విషయంలో కూడా వుండివుంటే ఎప్పుడో వచ్చేసేదే అనుకుంటా.

ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ సారి సంక్రాంతికి మాత్రం పోలీసులు వస్తారన్న భయం కానీ, కోడి పుంజులతో పాటు తమను కూడా కటకటాల వెనక్కి నెడుతారన్న అందోళన లేకుండా కోడిపందేలను అడుకోవచ్చని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తెలిపారు. ఈ మేరకు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని జారి చేసిందని కూడా తెలిపారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని ఆయ‌న చెప్పారు. ఒక ప‌క్క చ‌ట్టాల‌ను గౌర‌విస్తూనే, మ‌రో ప‌క్క అనాదిగా వ‌స్తున్న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్య‌త అందరిపై ఉంద‌ని ఆయ‌న అన్నారు.

అలాగని చట్టాన్ని అతిక్రమించే వారిపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చిరించారు. కాగా ఈ కోడిపందేలలో కోట్ల రూపాయల చేతులు మారుతుండటం గమనార్హం.  తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌ చౌద‌రిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles