ధేశంలో పెను సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో.. పాటియాలా హౌస్ కోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. డీఎంకే సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, రాజ్యసభ సభ్యురాలు డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిలకు భారీ ఊరటనిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వీరితో పాటుగా ఈ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలు చూపించలేకపోయిదంటూ స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేశారు. దీంతో ఇటు కనిమొళి, రాజాలకు భారీ ఊరట కలగడంతో పాటు డీఎంకే పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కీలకమైన ఆర్కేనగర పోలింగ్ నేపథ్యంలో ఈ తీర్పు వెలువడటం డీఎంకేకు బలం చేకూరినట్టయింది. అటు మన్మోహన్ సారథ్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వానికి కూడా నైతికబలం చేకూరినట్టయింది.
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా కేంద్ర టెలికంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని అరోపణలు తెరపైకి వచ్చాయి. ఆయన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక దాఖలు చేసింది. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ స్పష్టం చేసింది. దీనిపై సీబీఐ రెండు కేసులు, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఒక కేసు నమోదు చేశాయి.
స్వాన్ టెలికాం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా డీఎంకేకు చెందిన కలైంజర్ టీవీకి రూ.200 కోట్లు ప్రతిఫలం ముట్టజెప్పారని అరపణలు కూడా వచ్చాయి. వీటిని కూడా ఈ కేసులతో జత చేయగా, ఢిల్లీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ఈ కేసులపై విచారణ జరిపారు. సీబీఐ దాఖలు చేసిన రెండు కేసులలో మొదటి కేసులో ఎ.రాజా, కనిమొళి, టెలికంశాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్ద్ బెహ్రా, ఎ.రాజా మాజీ ప్రత్యేక కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిని నేరస్థులుగా చేర్చారు. రిలైన్స్ టెలికాం, స్వాన్ టెలికాం, యునిటెక్ వైర్లెస్ సంస్థలు విచారణకు హాజరై సాక్ష్యం చెప్పాయి.
2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయించడంలో ప్రభుత్వానికి రూ.30,984 కోట్ల ఆదాయానికి గండి పడిందని ఛార్జిషీటులో నమోదు చేశారు. ఆరేళ్లకు పైగా సాగిన విచారణ గత ఏప్రిల్ 26న ముగిసింది. దీనితో డిసెంబర్ 21న తీర్పు వెలువరించనున్నట్టు ఢిల్లీ సీబీఐ కోర్టు డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించింది. గురువారం తీర్పు సందర్భంగా కనిమొళి, రాజా సహా నిందుతులందరూ కోర్టుకు హాజరయ్యారు. వీరికి తోడుగా వందలాది మంది డీఎంకే అభిమానులు కూడా న్యాయస్థానంలోకి రావడంతో తీర్పును వెలువరించడంలో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇక తుది తీర్పులో వీరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించడంతో కనిమొళి, రాజా సంతోషం వ్యక్తం చేశారు. డీఏంకే సంబరాలు జరుపుకొంటోంది.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more