RBI may be holding back Rs2,000 notes.? రూ.2000 నోటు రద్దుకు రంగం సిద్దం.?

Government to demonetise rs 2000 notes next sbi report hints

Demonetisation, Reserve Bank, State Bank of India, RBI, Note ban, high-value notes, sbi research report, parliament, union government, remonetisation, latest news

The Reserve Bank of India (RBI) may either be holding back Rs 2,000 notes or could have stopped printing them as there is a surfeit of these notes in circulation which is creating problems in carrying out day-to-day transactions, according to an SBI Research report

రూ.2000 నోటు రద్దుకు రంగం సిద్దం.?

Posted: 12/21/2017 10:18 AM IST
Government to demonetise rs 2000 notes next sbi report hints

ధేశంలో పెద్ద నోట్లతో అవినీతి అంతకంతకూ పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో అప్పటి వరకు చెలామణిలో వున్న పెద్దనోటు కంటే రెట్టింపుస్థాయి విలువైన నోటును గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరి దృష్టి పడకుండా చెలామణిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటును కూడా కొన్ని రోజుల తరువాత రద్దు చేస్తారన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని కేంద్రంలోని మోదీ సర్కారు సాక్షాత్తు పార్లమెంటులోనే పలుమార్లు సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చింది.

దీంతో ఈ నోటు రద్దు కాదని దానిని తమ కబంధహస్తాలలో బంధించిన బడా వ్యాపారవేత్తలకు ఇప్పుడు ఎస్బీై తాజా నివేదిక చుక్కలు చూపిస్తుంది. అదేంటీ అంటారా..? త్వరలో రూ.2,000 నోట్లకు కేంద్రం చరమగీతం పాడనుందా...? తదుపరి డీమోనిటైజేషన్‌ ఇదే కానుందా..? అంటే ఎస్బీై తాజా నివేదిక మాత్ం అవుననే సంకేతాలను వెలువరించింది. భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకోవచ్చని లేదా అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను నిలిపివేయవచ్చంటూ ఎస్బీఐ తాజాగా విడుదల చేసిన ఎకోఫ్లాష్నివేదిక పేర్కొంది.

‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీల పరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్‌ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది’’ అని నివేదిక స్పష్టం చేసింది. తమ పరిశీలన ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,50,100 కోట్ల విలువ మేర చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్‌ 8 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో చిన్న నోట్ల విలువను మినహాయించి చూస్తే పెద్ద నోట్ల విలువ రూ.13,32,400 కోట్ల మేర ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్థిక శాఖ ఇటీవల లోక్ సభలో వెల్లడించిన సమాచారం మేరకు ఆర్బీఐ ఈ ఏడాది డిసెంబర్‌ 8 నాటికి రూ.500 నోట్లను 16,957 పీసుల మేర.. రూ.2,000 నోట్లను 3,654 పీసుల మేర ముద్రించింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15,78,700 కోట్లని కూడా పేర్కొంది. ఇందులో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.13,32,400ను మినహాయించి చూస్తే రూ.2,46,300 కోట్ల విలువ మేర పెద్ద నోట్లను ఆర్బీఐ ప్రింట్‌ చేసినప్పటికీ మార్కెట్లోకి పంపిణీ చేయలేదని నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఎస్బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ వివరించారు. అయితే, రూ.2,46,300 కోట్ల మేర రూ.50–200 మధ్య నోట్లను ఆర్బీఐ ఈ మధ్య కాలంలో ముద్రించి ఉంటుందని కూడా ఎస్బీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles