groom's family hurled money and mobiles on guests దేశ, విదేశీ కరెన్సీ వర్షం.. మొబైల్ ఫోన్ల వాన..

Guests were showered with dollars and mobile phones at pakistan wedding

Pakistan wedding, Tehsil Shujabad, Mohammad Arshad, Multan, Khanpur, dollars, mobile phones, Pakistan, viral video, money rain, bridegroom, Federal Board of Revenue, wedding ceremony, Pakistan

The Federal Board of Revenue (FBR) has taken notice of the incident that occurred at a wedding ceremony in Khanpur in which the groom's family hurled money and mobile phones during procession.

ITEMVIDEOS: దేశ, విదేశీ కరెన్సీ వర్షం.. వరుడి బంధువులపై కేసు

Posted: 12/21/2017 11:49 AM IST
Guests were showered with dollars and mobile phones at pakistan wedding

వివాహాలకు వచ్చే అతిథులపై పూలు, పన్నీరు చల్లడం సాధారణమే. అయితే కాసింత సంపన్నుల ఇళ్లలో రిటన్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా తెలిసిందే. ఇక తమ పరపతి చాటుకునే ప్రయత్నంలో పెళ్లి వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ కామనే. కానీ పెండ్లికి వచ్చిన అతిథులతో పాటు వేడుక జరిగిన ఊరు ఊరందరిపైనా డబ్బులు, మొబైల్‌ఫోన్లు వర్షంలా కురిపించడం గురించి తెలుసా..? అదే పాకిస్థాన్ లో జరిగింది.

తన మన పర బేధం లేకుండా అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోనో, దేశీయ, విదేశీ కరెన్సీల వర్షం కురిసిందక్కడ. డాలర్‌ లేదా రియాల్‌ కరెన్సీ నోటో అతిధులకు సొంతమైంది. దొరికిన వాడికి దొరికినంత అన్నట్లుగా అక్కడి అతిధులు, వేడుకకు హాజరైన వారు తమ జేబుల్లో జొప్పించేసుకున్నారు. పాకిస్తాన్‌లో జరిగిన ఓ పెండ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్ లోని షుజాబాద్ కు చెందిన మొహమ్మద్‌ అర్షద్ కు.. పంజాబ్‌ ఫ్రావిన్స్ లోని ఖన్పూర్ కు చెందిన వధువుతో వివాహమైంది. వరుడు వధువువారింటికి వివాహవేదిక వద్దకు చేరుకోగానే.. అర్షద్ బంధువులు ఇలా నోట్లు, మొబైల్ ఫోన్ల వర్షం కురిపించారు. యావత్ పాకిస్థాన్ సహా నెట్టింట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో చేతికి ఏ నోటు వస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయిన వరుడి బంధువులు కాసుల వర్షం కురిపించారు.

అందుకు కారణం.. అర్హద్ కు మొత్తం ఎనిమిది మంది సోదరలు వుండగా, వారిలో నలుగురు అమెరికాలోనూ, ఇంకొందరు సౌదీ అరేబియాలోనూ స్థిరపడి బాగా సంపాదించారు. ఆఖరు తమ్ముడి పెళ్లి అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఇలా కాసులు, కాస్టీ మొబైల్ ఫోన్ల వర్షం కురిపించారు. అయితే అదే ఇప్పడు వారికి కష్టాలను కూడా తెచ్చిపెట్టింది. వారు విసిరిన కాసులు వర్షం నేపథ్యంలో పాకిస్థాన్ లోని ఫెడరల్ బోర్డు అఫ్ రెవెన్యూ దినిపై దృష్టి సారించింది. ఈ డబ్బులన్నీ లెక్కలు వున్నావేనా..? లేక అక్రమంగా సంపాదించినవా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Federal Board of Revenue  viral video  money rain  bridegroom  multan  social media  Pakistan  video viral  

Other Articles