Vodafone Five New Prepaid Recharge Plans కస్టమర్లకు వోడాఫోన్ పాంచ్ పటాకా అఫర్..

Vodafone prepaid recharge plans with 1gb 1 5gb data per day

Vodafone, Vodafone Super Plans, Vodafone prepaid recharge plans, Vodafone plans, Reliance Jio, Prepaid recharge plans, vodafone, new prepaid plans, super plans, unlimited voice calls, data combo, sms, airtel, jio, idea, telecom companies

Vodafone has launched five new prepaid recharge plans starting from Rs. 79. The new prepaid recharge plans - under Vodafone's Super Plans - offer a combination of data, SMS (short message service), and unlimited local, STD and national roaming calls

కస్టమర్లకు వోడాఫోన్ పాంచ్ పటాకా అఫర్..

Posted: 12/06/2017 11:17 AM IST
Vodafone prepaid recharge plans with 1gb 1 5gb data per day

టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో అప్పటి వరకు జనం డబ్బును అప్పన్నంగా లాగేసుకన్న టెలికాం సంస్థలు కాస్తా ఇప్పుడు డబ్బును విధుల్చుకోక తప్పడం లేదు. జియో దెబ్బతో పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ కస్టమర్ల పంట పండుతోంది. ఇప్పటికీ పోస్ట్-పెయిడ్ ఛార్జీలను టెలికాం సంస్థలు భారీగా తగ్గించాయి. ఇప్పుడు ప్రీ-పెయిడ్ కస్టమర్లు జారిపోకుండా టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా తమ ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ఐదు వినూత్న ప్లాన్స్‌ను వోడాఫోన్  ప్రకటించింది.

‘సూపర్ ప్లాన్స్’ పేరుతో కస్టమర్లకు అవసరమైన డేటా, ఎస్ఎంఎస్, అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. దీన్ని  2జీ లేదా 3జీ/4జీని సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్లకు ఈ ప్లాన్స్‌ను వినియోగించుకోవచ్చు.

* రూ.509 ప్లాన్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 84 రోజులు
* రూ.458 ప్లాన్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 70 రోజులు
* రూ.347 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 28 రోజులు
* రూ.199 ప్లాన్: నెలవారిగా 10 జీబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, నేషనల్) వ్యాలిడిటీ 28 రోజులు
* రూ.79ల రీఛార్జీపై  7 రోజుల వ్యాలిడిటీ ఉండే మరొక ప్లాన్‌ను తీసుకొచ్చారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అందరు వొడాఫోన్ కస్టమర్లు ఈ ప్లాన్స్‌ను తీసుకోవచ్చు. తమ కస్టమర్ కేర్ సెంటర్లు లేదా మైవొడాఫోన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్లాన్స్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని వొడాఫోన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vodafone  new prepaid plans  super plans  unlimited voice calls  data combo  sms  airtel  jio  idea  telecom companies  

Other Articles