PM Modi's Twitter following rose 51% ప్రధాన మంత్రిని దాటేసిన పరుగుల యంత్రం..

Modi s twitter following grows by 52 virat kohli s 61

kohli growthrate crosses modi account, modi twitter account, virat kohli twitter account, increaseNarendra Modi, Twitter, most followed, followers, twitter users, Virat Kohli, growth rate, PM Modi

Prime Minister Narendra Modi continues to be the most followed Indian on Twitter even as the growth in his follower base at 52% was lower than that of Indian cricket captain Virat Kohli,

ప్రధాన మంత్రిని అధిగమించిన పరుగుల యంత్రం..

Posted: 12/06/2017 11:53 AM IST
Modi s twitter following grows by 52 virat kohli s 61

టీమిండియా పరుగులు మెషీన్, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు తన పరుగుల ప్రహసనాన్ని కొనసాగిస్తూ.. తన కెరీర్ లో అనేక మైలురాళ్లను అధిగమిస్తూ.. కొత్త రికార్డులను లిఖించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వేళ్ల.. అతనికి దేశ, విదేశాల్లో అభిమానుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ పోతుంది. దీంతో కోహ్లీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న అభిమానుల సంఖ్య కూడా అధికంగానే వుంది. తన పరుగుల వేగం మాదిరిగానే అతడ్ని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్యకూడా అంతే వేగంగా పెరుగుతూ పోతుంది.

సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లో కోహ్లి ఫాలోవర్లు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎంత వేగంగా పెరుగుతుందంటే ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీనే అధిగమించాడు కోహ్లి. తాజాగా ట్విట్టర్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మోదీ ఫాలోవర్ల సంఖ్య 52 శాతం పెరగ్గా, కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 61 శాతంతో దూసుకుపోయింది. ప్రస్తుతం కోహ్లిని 20.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

కాగా భారతదేశంలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా మాత్రం ప్రధాని మోదీ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మోదీకి ఇప్పటివరకు 37.5మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఎక్కువ మంది ఫాలో అవుతున్న టాప్ 10 సెలబ్రిటీలలో మోదీ తరువాత అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, కోహ్లి స్థానాలను సంపాధించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Twitter  most followed  followers  twitter users  Virat Kohli  growth rate  PM Modi  

Other Articles