Amrutha is Jayalalithaa's daughter, asserts friend Geetha జయ ‘అమృత’మే నిజం.. తేల్చిచెప్పిన గీత

Amrutha is jayalalithaa s daughter for sure asserts friend geetha

Secret Of Jayalalitha,Jayalalithaa’s Daughter,Jayalalitha Soban babu Daughter,Jayalalitha friend Geetha,Amrutha Sarathy, jayalalithaa, shoban babu, amrutha sarathy, geetha, sasikala, deepa jayakumar

Geetha, a close friend of former Tamil Nadu chief-minister J. Jayalalithaa, has asserted that she has every reason to believe that Bangalore-based Amrutha might be the daughter born to Jayalalithaa and late Tollywood actor Sobhan Babu

జయ ‘అమృత’మే నిజం.. తేల్చిచెప్పిన గీత

Posted: 12/02/2017 10:31 AM IST
Amrutha is jayalalithaa s daughter for sure asserts friend geetha

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత అనేక మంది తామే అమ్మకు వారసులమంటూ న్యాయస్థానాలను అశ్రయించిన నేపథ్యంలో అమ్మ నిజమైన వారసురాలు వున్నారా..? వున్నా వెలుగులోకి వస్తారా..? వారు వచ్చేందుకు యత్నించినా.. రాజకీయ నేతలు అమెను ముందుకు రాణిస్తారా.? అన్న అనుమానాలు ఇప్పుడు తమిళనాడువ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ క్రమంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇటీవల సంచలన బాంబు పేల్చారు.

జయలలితకు అడపిల్ల వుందన్న మాట వాస్తవమని, అయితే అమె అమృత అవునో కాదు..? మాత్రం తనకు తెలియదని అన్నారు. ఇప్పుడా అడపిల్ల ఎక్కడ వుందో..? ఎలా వుందో కూడా తెలియదని అన్నారు. కాగా తాజాగా తాను జయలలిత కుమార్తె నంటూ కోర్టును ఆశ్రయించిన అమృత.. దివంగత ముఖ్యమంత్రి కుమార్తేనని జయలలిత స్నేహితురాలు గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటుడు శోభన్ బాబు, జయలలితకు ఆమె జన్మించిందని పేర్కొన్నారు.

1999లో తానోసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకో కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని, ఆమె పేరు అమృత అని చెప్పారని గీత గుర్తు చేసుకున్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవన్నారు. అయితే అమెను ఎవరికీ తెలియకుండా పెంచారన్నారు. అమృత.. జయలలిత కూతురా? కాదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల్లోనే తేలుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని గీత పేర్కొన్నారు.

జయ సన్నిహితురాలు శశికళకు కూడా ఈ విషయం తెలుసునన్నారు. అయతే ఈ విషయాన్ని ఎవరు అంగీకరించినా.. ఎవరు చెప్పినా.. లేకపోయినా తాను మాత్రం ఈ విషయాన్ని వెల్లడించాలన్న ఉద్దేశ్యంతోనే చెప్పానని అన్నారు. ఇప్పటికైనా జయ కుమార్తె అజ్ఞతవాసం ముగియాల్సిన అవసం వుందని అన్నారు. పుట్టినప్పటి నుంచి ఎవరో తెలియకుండా పెరిగిన అమృతకు ఇప్పటికైనా న్యాయం జరగాల్సిన అవసరముందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  shoban babu  amrutha sarathy  geetha  sasikala  deepa jayakumar  

Other Articles