Amit Shah is a Jain, says Congress' Raj Babbar ముందు అమిత్ షా హైందవ విషయాన్ని తేల్చండి

Amit shah calls himself hindu but he is jain congress leader raj babbar

Raj Babbar, Rahul Gandhi, Somnath Temple, Bharatiya Janata Party, Amit Shah, Hindu, Jainism, Congress, BJP, Rahul Gandhi religion, Rahul Gandhi news, amit shah jainism, amit shah rajbabbar, amit shah religion, amit shah gujarat, amit shah maharastra, politics

In a statement, Congress leader Raj Babbar brought BJP chief Amit Shah's faith in question, calling him a Jain and not a Hindu.

ముందు అమిత్ షా హైందవ విషయాన్ని తేల్చండి

Posted: 12/02/2017 11:14 AM IST
Amit shah calls himself hindu but he is jain congress leader raj babbar

కాంగ్రెస్ పార్టీ నేత, ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను  హిందువునని చెప్పుకుంటున్నా అమిత్ షా అసలు హిందువే కాదని సంచలన అరోపణలు చేశారు. అమిత్ షా హైందవుడిగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప అసలు అయన హిందువు కాదని అన్నారు. ఆయన జైన మతస్తుడు అని అరోపించారు.

ముంబైలోని జైన కుటుంబంలో అమిత్ షా పుట్టారని...  ఆ తర్వాత గుజరాత్ కు వచ్చి సెటిలయ్యారని తెలిపారు. అయన హిందువుడా, లేక జైనుడా అన్న విషయమై ముందుగా తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అమిత్ షా కపటి హిందువు నాటకాలను కట్టిపెట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. అయన నిజ స్వరూపం బట్టబయలు చేస్తామని.. మరి ఇందుకు అమిత్ షా సిద్దమేనా అని రాజబబ్బర్ సవాల్ విసిరారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఈ మతాల గొడవ అటుఇటు తిరిగి చివరకు అమిత్ షాకే చుట్టుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాన్ హిందూ డిక్లరేషన్ బుక్ లో సంతకం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. తెలియక లేడిస్ టాయ్ లెట్ లోకి వెళ్లిన అంశంపైనా బీజేపి నేతలు రాజకీయం చేసి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని, మరీ మతమార్పిడులకు వ్యతిరేకమని వాదిస్తున్న బీజేపి మాత్రం హిందువే కాని వాడిని అధ్యక్షుడిగా ఎలా చేసుకుందని రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Babbar  Rahul Gandhi  Somnath Temple  Amit Shah  Hindu  Jainism  Congress  BJP  

Other Articles