Taliban attack Pakistan college, 12 killed, 37 injured పాకిస్తాన్ లో మారణహోమం.. 12 మంది మృతి

Burqa clad suicide bombers storm student dorm in pakistan 9 killed

Taliban, salahuddin khan mehsud, Islamabad, islam zeb, Asif Ghafoor, university hostel, peshawar, security forces, pakistan, terrorism

At least 12 people, including six students, were killed and 37 injured when Pakistani Taliban disguised as women in burqas attacked a university hostel in Pakistan's northwestern city of Peshawar

పాకిస్తాన్ లో మారణహోమం.. కాలేజీపై ఉగ్రపంజా

Posted: 12/02/2017 09:40 AM IST
Burqa clad suicide bombers storm student dorm in pakistan 9 killed

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రక్తపుటేరులు పారించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దాయాధి దేశానికి పాలు పోసి పామును పెంచుతున్నామన్న విషయం ఇప్పటికే నిరూపితం అయినా.. మళ్లీ అలాంటి పోరాబాటే చేయడంతో.. ఉగ్రభూతం పడగవిప్పింది. బురఖాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు పెషావర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ మారణహోమంలో అరుగురు విద్యార్థులతో పాటు ఐదుగురు నగర పౌరులు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారని ఖైబర్ ఫక్ తున్వా పోలీసు అధికారి సలావుద్దీన్ ఖాన్ తెలిపారు. మరో 32 మంది గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ ప్రకటించింది. మృతులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం ప్రముఖ రాజకీయ నేత తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ పాక్ సైన్యంపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం పట్ల సైన్యం సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు నిధులు అందిస్తున్న ఆర్మీ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే, చివరకు పాకిస్థానే నాశనం అవుతుందనే విషయం ఇప్పటికీ సైన్యానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆమె తండ్రి ఖండించడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles