శృంగార తార హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చిన అందాల బామ సన్ని లియాన్ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. 2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కత్రినా కైఫ్‌లాంటి స్టార్ హీరోయిన్‌లను దాటుకొని యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ జాబితాలో మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్ నిలిచారు.
ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా అగ్రస్థానంలో నిలిచారు. మొన్నటి తరం సినీమా నటుడిగా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసిన వినోద్ ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన గురించ నెట్ జనులు చాలానే వెతికేశార. అసలు ఈయన ఎప్పటి నటుడు, ఆయన నటించిన చిత్రాలు, ఆయన జీవితంలో కీలక విషయాలపై ఈ అన్వేషణ సాగిందట. యాహూ సర్చ్ ఇంజన్ వేదికగా ఈ అన్వేషణ సాగిందని ఆ సంస్థ ప్రకటించింది. వినోద్ ఖన్నా తరువాతి స్థానంలో అగ్రహీరోలు, పాపులర్ నటులను దాటుకుని బుల్లితెరపై సంచలనం రేపుతున్న నటుడు కపిల్ శర్మ వచ్చి చేరాడు.
కపిల్ కామెడీ షో తో యావత్ భారత ప్రేక్షకులకు సుపరిచితుడైన కపిల్ శర్మ.. అనూహ్యంగా రెండో స్థానాన్ని అక్రమించుకున్నాడు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, రజినీ కాంత్ లాంటి ప్రముఖలను దాటుకుని శంకర్ లాంటి దర్శకులను వెనక్కి నెట్టి మరీ రెండో స్థానంలో నిలిచాడు. అందుకు ఆయన చేసిన వివాదాలు కూడా కారణం కావచ్చు. అ మధ్య తన టీమ్ తో విదేశాలకు వెళ్లి తిరిగివస్తూ అయన తన సహచరులపై దాడికి పాల్పడిన ఘటన, లేదా అ తరువాత ఆయన టీమ్ మేట్స్ ఆయనను విడిచి వెళ్లడం, మళ్లి వచ్చి కలవడం లాంటి ఘటనలతో కపిల్ శర్మ రెండోస్థానాన్ని అక్రమించివుండవచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి.
2017 యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల జాబితా
సన్నీలియోన్
ప్రియాంకా చోప్రా
ఐశ్వర్య రాయ్
కత్రినా కైఫ్
దీపికా పదుకునే
కరీనా కపూర్
మమతా కులకర్ణి
దిశాపటాని
కావ్యా మాధవన్
ఇషా గుప్తా
2017 యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల జాబితా
వినోద్ ఖన్నా
కపిల్ శర్మ
దిలిప్
జస్టిన్ బీబర్
సునీల్ గ్రోవర్
కమల్ హాసన్
రజనీకాంత్
రుఫీకాపూర్
అమితాబ్ బచ్చన్
(And get your daily news straight to your inbox)
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more
May 25 | కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చుతూ జీవో విడుదల చేయడంతో చేపట్టిన ఆందోళనలను ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించేందుకు వస్తామని... Read more