metro rail starts maiden service మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం.. హుషారుగా కదిలిన ప్రయాణికులు

Hyderabad metro rail starts maiden service from nagole and miyapur

metro rail charges review, metro charges should be reviewed, metro rail charges review, high metro rail charges, metro rail common man, metro rail taxi rates, metro rail auto charges, Prime Minister Narendra Modi, PM modi, hyderabad metro rail, metro train Shedule, metro rail services, metro rail rates, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

hyderabad metro rail starts maiden service from nagole and miyapur, It took nearly 42 minutes for nagole passengers to reach final destination.

మెట్రోలో పోదాం.. పట్నంలో తిరుగుదాం.. చలో.. చలో..

Posted: 11/29/2017 10:24 AM IST
Hyderabad metro rail starts maiden service from nagole and miyapur

నాలుగు వందలఏళ్లకు పైగా చరిత్ర గలిగిన హైదరాబాద్ నగర ప్రగతిని మరో మెట్టుకు చేర్చుతూ.. ప్రగతి చక్రానికి ప్రత్యామ్నాయంగా కలల బండి ఇవాళ కూత పెట్టి కదిలింది. అదేంటో అర్థమైంది కదూ.. హైదరాబాద్ మెట్రో రైలు ఇవాళ ఉదయం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. క్రితం రోజున ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఉదయం ఆరు గంటలకు అటు నాగోల్, ఇటు మియాపూర్ స్టేషన్లలో రెండు రైళ్లు తొలికూత పెట్టాయి. ఇక తొలి ప్రయాణానికి మెట్రో స్టేషన్లకు వచ్చితొలి టికెట్ కొన్న ప్రయాణికులకు అధికారులు బహుమతి ఇచ్చి అభినందించారు. ఆరు గంటలకు నాగోల్ లో ప్రారంభమైన రైలు అమీర్ పేటకు చేరుకోగా, మియాపూర్ లో బయలుదేరిన రైలు అమీర్‌పేట చేరుకుంది. మెట్రో రాకతో నాగోలు నుంచి అమీర్ పేటకు ప్రయాణ దూరం 42 నిమిషాలకు తగ్గిపోయింది.

మెట్రో రైలులో ప్రయాణించిన తొలి ప్రయాణికుల ముఖాల్లో ఆనందం కనిపించింది. తొలి ప్రయాణం అనుభవం దక్కినందుకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సెల్ఫీలతో తొలి జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడవనున్నాయి. రెండు మార్గాల్లో పది చొప్పున మొత్తం 20 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రతీ పదిహేను నిమిషాలకో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

మెట్రో రైలుకు మొత్తం మూడు కోచ్ లు ఉండగా ఒక్కో దాంట్లో దాదాపు 330 మంది వరకు ప్రయాణించే వీలుంది. అంటే ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ లెక్కన రోజుకు మూడు లక్షమంది వరకు ప్రయాణిస్తారని అంచనా. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ట్రిప్పులు పెరిగే, తగ్గే అవకాశాలున్నాయి. అలాగే కోచ్‌లను కూడా పెంచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెట్రో ప్రయాణించే రెండు మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు కనీస చార్జీ పది రూపాయలు కాగా, గరిష్ట చార్జీ రూ.60.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad  nagole  ameerpet  passengers  miyapur  telangana  

Other Articles